బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్ అసహనం?

పవన్ కల్యాణ్ కు చంద్రబాబు పరామర్శ

Update: 2025-09-28 08:33 GMT

PAWAN KALYAN & CHANDRABABU

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పరామర్శించారు. నాలుగు రోజులుగా పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పవన్ సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

జ్వరంతోనే పవన్ కల్యాణ్ తన శాఖలపై సమీక్షలు చేశారు. అనంతరం వైద్యులు పవన్ కల్యాణ్‌‌కు వైద్యం అందించారు. అయినా జ్వరం తగ్గక పోవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ చూపించుకున్నారు. ఈ క్రమంలో పవన్‌ని చంద్రబాబు పరామర్శించారు.

ఈ సమయంలోనే ఆయన ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలనూ చంద్రబాబుతో ప్రస్తావించినట్టు సమాచారం. బాలకృష్ణ చిరంజీవిపైన, జగన్ పైన చేసిన వ్యాఖ్యలనూ ప్రస్తావిస్తూ బాలకృష్ణ తీరుపై అసహనం వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది.

చిరంజీవి చెప్పినవి అబద్ధాలని, జగన్ ను సైకో అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రస్తుతం రాష్ట్రంలో దుమారం చెలరేగుతోంది. మరోపక్క చిరంజీవి అభిమానుల సంఘం నాయకులు ఇవాళ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను చర్చించినట్టు సమాచారం. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News