చంద్రబాబుతో కార్లో వచ్చిన మంత్రులు ఎవరంటే..
అది టీడీపీ క్రమశిక్షణంటే.. దటీస్ చంద్రబాబు అంటే అని మాట్లాడుకోవడం పరిపాటిగా మారింది.;
By : The Federal
Update: 2025-05-27 12:19 GMT
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇండియాలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషయన్. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కంటే చంద్రబాబే సీనియర్ నాయకుడు. ఆ విషయం చంద్రబాబే ఓ సారి అసెంబ్లీ వేదికగా ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు సీఎంగాను, విభజన అనంతరం రెండో సారి ముఖ్యమంత్రిగాను ఉన్నారు. ప్రతిపక్ష నేతగా కూడా ఎక్కువ కాలం ఉన్నారు. అలిపిరి ఘటనతో చంద్రబాబు భద్రతే మారిపోయింది. సెంట్రల్ గవర్నమెంట ఆయనకు జడ్‌ప్లస్ కేటగిరీ భద్రత ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆయన ఎన్‌ఎస్‌జీ ప్రొటెక్టీ. అంత భారీ భద్రత కలిగిన సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కారులో ప్రయాణించే అవకాశం చాలా తక్కువ మందికే లభిస్తుంది. కడపలో జరుగుతున్న మహానాడు వేళ ఆ అవకాశం కొంత మంది నేతలకు దక్కింది.
సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కారులో ప్రయాణించే అవకాశం మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు దక్కింది. సీఎం చంద్రబాబు నాయుడును మహానాడు వేదిక వద్దకు తీసుకొచ్చేందు ఈ ముగ్గురు నేతలు చంద్రబాబుతో పాటు ఆయన కారులో వచ్చారు. మహానాడు వేదిక వద్దకు చంద్రబాబు వాహన శ్రేణి రాగానే టీడీపీ మంత్రులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మహానాడు వేదిక ప్రాంగణంలోకి ప్రవేశించారు. రిజిస్ట్రేషన్∙రుసుం చెల్లించి టీడీపీ ఐడీ కార్డును, ఫైల్‌ను తీసుకుని లోనికి ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీకి అధినేత అయ్యుండి, ఆ పార్టీకి జాతీయ అ«ధ్యక్షులై ఉండి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వేదిక ప్రాంగణంలోకి నేరుగా వెళ్లే అవకాశం ఉన్నా.. ఎలాంటి భేషజాలకు పోకుండా ఒక సామాన్య కార్యకర్త మాదిరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని, రుసుం చెల్లించి మరీ చంద్రబాబు లోపలికెల్లిన తీరును చూసి అక్కడున్న టీడీపీ శ్రేణులంతా ఒక్క సారిగా ముక్కున వేలేసుకున్నారు. అది టీడీపీ క్రమశిక్షణంటే.. దటీస్ చంద్రబాబు అంటే అని మాట్లాడుకోవడం పరిపాటిగా మారింది.