ఉచిత గ్యాస్‌లో ఈ ట్విస్ట్‌ ఏమిటి?

దీపావళి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన వారికి ఉచిత గ్యాస్‌ ఇస్తామంటున్న ప్రభుత్వం ఒక్కో సిలెండర్‌పై రూ. 69.42లు ఎక్కువ ఎందుకు చెల్లిస్తోంది.

Update: 2024-10-27 04:37 GMT

ఏపీలో ఉచిత గ్యాస్‌ పథకం దీపావళి నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు విధి విధానాలు ఇంకా ఇవ్వలేదు. గ్యాస్‌ పథకం ప్రారంభం కాకముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. లబ్ధిదారుడు డబ్బులు చెల్లించి సిలెండర్‌ తీసుకున్న తరువాత ప్రభుత్వం డబ్బులు డీబీటీ ద్వారా లబ్ధిదారుల అకౌంట్స్‌కు ఇస్తుంది. మూడు ఆయిల్‌ కంపెనీలతో ఒప్పందం కుదిరిందని ప్రభుత్వం చెబుతోంది. ఆ ఒప్పందం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఆ కంపెనీలు ఏవో కూడా తెలియదు. కంపెనీల వివరాలు తెలియకపోయినా పరవాలేదు. డబ్బులు నేరుగా ఆయిల్‌ కంపెనీల వారికి ప్రభుత్వం చెల్లిస్తున్నప్పుడు లబ్ధిదారుడు ఎందుకు డబ్బులు చెల్లించి సిసెండర్‌ తీసుకోవాలనేది లబ్ధిదారులను వేదిస్తున్న ప్రశ్న.

సాదారణ ధరకంటే ఎందుకు ఎక్కువ చెల్లించాలి?
ప్రభుత్వం ప్రస్తుతం గ్యాస్‌ సిలెండర్‌ ధరను రూ. 825.50లుగా నిర్ణయించింది. గ్యాస్‌ డెలివరీ బాయి సిలెండర్‌ వినియోగ దారునికి ఇచ్చిన తరువాత రూ. 850లు తీసుకుంటున్నాడు. ఎందుకు రూ. 25 లు ఎక్కువ తీసుకుంటున్నావని ప్రశ్నిస్తే బాయ్‌కు ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా సార్‌ అంటూ ప్రశ్నిస్తున్నాడు. ప్రభుత్వం మాత్రం బాయ్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతోంది. ప్రస్తుతం గ్యాస్‌ బుక్‌ చేసిన నాలుగో రోజుకు వస్తోంది. ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నిస్తే స్టాక్‌ సకాలంలో రావడం లేదని డెలివరీ బాయ్‌ సమాధానం ఇస్తున్నాడు.
సివిల్‌ సప్లైస్‌ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ ఉచిత గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వారు సిలెండర్‌ ఇంటికి రాగానే రూ. 894.92లు చెల్లించి తీసుకోవాలన్నారు. ఈ మొత్తం చెల్లించినా డెలివరీ బాయ్‌ మరో రూ. 25లు తప్పనిసరిగా తీసుకుంటున్నాడు. అంటే రూ. 920లు చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా గ్యాస్‌ అన్న తరువాత ఈ ట్విస్ట్‌లు ఏమిటనేది లబ్ధిదారుల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం గ్యాస్‌ ధర రూ. 825.50లు ఉంటే ఉచిత గ్యాస్‌ ధర రూ. 894.92లుగా ఎందుకు ఉందనే చర్చ ఇప్పటికే ప్రజల్లో జరుగుతోంది. బాయ్‌కు అదనంగా ఇచ్చే డబ్బులు కాకుండా ప్రభుత్వం లబ్ధిదారుడి నుంచి తీసుకునే డబ్బే రూ. సాధారణ కొనుగోలు కంటే ఉచిత కొనుగోలు విషయంలో రూ. 69.42లు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు కోటి మంది ఉచిత గ్యాస్‌ పథకానిని ఎంపికయ్యారనుకుంటే వారి నుంచి సాధారణ గ్యాస్‌ ధరకంటే అదనంగా వసూలు చేస్తున్న డబ్బలు రూ. 69.42 కోట్లు. ఇది కేవలం ఒక్కసారి తీసుకున్నప్పుడు మాత్రమే. ఇక సంవత్సరం మీద లెక్క వేస్తే ఎంత అవుతుందో తెలిసిందే. ఉచితం అంటూనే సాధారణ ధరకంటే సిలెండర్‌కు ఎక్కువ డబ్బలు ఎందుకు చెల్లించాలి. ఈ డబ్బు ప్రజల డబ్బు కాదా? అనే ప్రశ్న ప్రజలను వేదిస్తోంది.
ఆయిల్‌ కంపెనీలకు ప్రభుత్వం డబ్బు ఇస్తున్నప్పుడు లబ్దిదారుడు ముందుగా ఎందుకు చెల్లించాలి?
ఆయిల్‌ కంపెనీలకు ప్రభుత్వం ముందుగా సబ్సిడీని ఇవ్వకుండా సిలెండర్‌ డెలివరీ చేసిన తరువాత ఇస్తుండటం వల్ల లబ్ధిదారుల నుంచి ఆయిల్‌ కంపెనీల వారు ముందుగానే డబ్బలు వసూలు చేస్తున్నారు. సిలెండర్‌ తీసుకున్న తరువాత సబ్సిడీ మొత్తం వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయోననే భయం కూడా లబ్ధిదారుల్లో ఉంది. తుపాన్‌ సాయం మాదిరిగానే ఇది కూడా తయారవుతుందే తప్ప అందరికీ అందే అవకాశాలు లేవని ముందుగానే చర్చించుకోవడం విశేషం.
సిలెండర్‌ మహిళ పేరుతోనే ఉండాలా?
తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబానికి ఉచిత గ్యాస్‌ అంటున్నా ఇంటి యజమాని కాకుండా యజమాను రాలు పేరుతోనే గ్యాస్‌ సిలెండర్‌ ఉండాలనే నిబంధన విధిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే చాలా ఇండ్లలో భర్త పేరుతోనే సిలెండర్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. వారందరూ అర్హులు కాకుండా పోతారు. మహిళల పేరుతో కనెక్షన్‌ ఉందంటే అది దీపం పథకం కింద తీసుకున్నది మాత్రమే అయి ఉంటుంది. అలా కాకుండా భార్య పేరుతో గ్యాస్‌ కనెక్షన్‌లు తీసుకున్న వారు ఉన్నప్పటికీ తక్కువ మంది ఉంటారని, అర్హులైనా ఈ ఒక్క షరతుతో చాలా మంది పథకానికి అర్హులు కాకుండా పోతారని పలువురు ఉచిత గ్యాస్‌ కోసం ఎదురు చూసే వినియోగదారులు చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News