"శ్రీశైలం' విద్యుత్ కేంద్రంలో ఏమి జరిగింది?

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఎందుకు ఆటంకం కలిగింది. అక్కడ పనిచేసే ఉద్యోగులు ఎందుకు పరుగులుదీశారు.

Update: 2024-09-04 13:46 GMT

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో పేలుడు సంభవించింది. విద్యుత్ ఉత్పత్తి ఆగింది. జలవిద్యుత్తు కేంద్రంలో పనిచేసే సిబ్బంది కూడా పరుగులు తీసినట్లు తెలిసింది. బుధవారం ఈ సంఘటన జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో.. శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో అన్ని గేట్ల మూసివేశారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.



విద్యుత్ ఉత్పత్తి జరిగే సమయంలో జల విద్యుత్ కేంద్రంలో శబ్దం వినిపించినట్లు అక్కడ సిబ్బంది ద్వారా సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన శ్రీశైలం జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.



సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా జల విద్యుత్ కేంద్రంలోని ఏడవ నంబర్ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు అధికారుల ప్రకటించారు. ఇక్కడ ఉత్పత్తి జరుగుతున్న సమయంలోనే భారీ పేలుడు సంభవించినట్లు తెలిసింది. సమీప ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. సాంకేతిక లోపం కారణంగా వల్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన యూనిట్లో మరమ్మతులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా..

శ్రీశైలం జలాశయానికి వరద నీటి ఉధృతి కూడా తగ్గింది. జలాశయానికి వరద నీరు తగ్గడంతో పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడానికి కాలిపోవడం వల్లనే జరిగినట్లు. పవర్ హౌస్ లో వచ్చిన పేరులు శబ్దానికి ఏం జరిగిందో అర్థం కాని స్థితిలో మిగతా విభాగాల్లో పనిచేస్తున్న ఆందోళనకు గురయ్యారు. కొందరు ఏ నోటు నుంచి పరుగులు తీసినట్లు సమాచారం.
విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన అనంతరం ఏడో నెంబర్ యూనిట్ లో అధికారులు పరిశీలించారు. ఏడో నంబర్ యూనిట్లో సాంకేతిక లోపం కారణం గా శబ్దాలు రావడంతో పాటు కండెన్సర్ కాలిపోయినట్లు గుర్తించి మరమ్మతులు చేపట్టారు. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తెలుస్తోంది.
Tags:    

Similar News