ఎస్సీ మహిళను హోం మంత్రి, ఎస్టీ మహిళను డిప్యూటీ సీఎంని చేశాం

ఎక్కడ మహిళలు పూజింప బడుతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని జగన్‌ అన్నారు.;

By :  Admin
Update: 2025-03-08 07:36 GMT

అంతర్జాతీయ మహిళా దినోత్సం సందర్భంగా శనివారం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటూ రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందని గట్టిగా నమ్మే వ్యక్తిని తాను అని పేర్కొన్నారు. ఎక్కడ మహిళలు పూజింపబడుతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు. ఆ దిశలోనే తమ ప్రభుత్వ హయాంలో మహిళల అభ్యున్నతి, సాధికారతకు పెద్ద పీట వేశామని, ఆ దిశగానే తమ పాలన సాగించామన్నారు. అన్ని రంగాలలో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కుపైగా సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు భరోసా కల్పించామన్నారు.

నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్ట్‌ పనుల్లోను 50 శాతం కేటాయిస్తూ తొలిసారిగా చట్టం తీసుకొచ్చామన్నారు. చరిత్రలో లేని విధంగా దళిత మహిళను హోం మంత్రిగాను, గిరిజన మహిళను ఉప ముఖ్యమంత్రిగాను పదవులు కేటాయించి మహిళలను పెద్ద పదవులతో గౌరవించామన్నారు. మహిళల భద్రత కోసం, వారి రక్షణ కోసం ‘దిశ’ వ్యవస్థను ప్రవేశపెట్టి అండగా నిలిచామన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారనే నానుడిని నమ్ముతూ ఆ దిశగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. తన భవిష్యత్‌ రాజకీయ ప్రస్థానం కూడా మహిళల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా సాగుతుందని పేర్కొన్నారు. ఆ మేరకు జగన్‌మోహన్‌రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్స్‌ వేదికగా తన శుభాకాంక్షలను వెల్లడించారు.
Tags:    

Similar News