వాకింగ్ వద్దన్నారని లయోలా కళాశాల అటానమస్‌ను రద్దు చేయించారా
దశాబ్దాల చరిత్ర కలిగిర ఆంధ్రాలయోలా కళాశాలకు ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోన్న అటానమస్ హోదాను ప్రభుత్వం రద్దు చేసింది.;
Byline : Vijayakumar Garika
Update: 2025-03-24 04:00 GMT
సహజంగా ఏదైనా యూనివర్శిటీకి కానీ, కాలేజీలకు కానీ విద్యార్థులతో వైరం ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు వారి హక్కుల కోసం విశ్వవిద్యాలయం పెద్దలతో, కళాశాల యాజమాన్యాలతో పోరాటాలు సాగిస్తుంటారు. ఇది విద్యా వ్యవస్థలో ఒక భాగం. అంత మాత్రానా విద్యార్తుల మీద కళాశాల యాజమాన్యాలు కానీ, విశ్వవిద్యాలయాల పెద్దలు కానీ, అదేవిధంగా విద్యార్థులకు వారిపైన కానీ ఎలాంటి ద్వేషం ఉండదు. పరస్పరం కోపతాపాలకు పోరు. ఒకరిపై ఒకరు కక్షలకు దిగరు. పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలని అవకాశాల కోసం ఎదురు చూడరు. దొంగ దెబ్బ తీయాలని అసలే చూడరు.
కానీ విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాల పరిస్థితి అందుకు భిన్నం. ఇక్కడ విద్యార్థులకు, ఆంధ్రా లయోలా కళాశాల యాజమాన్యానికి మధ్య ఎలాంటి సమస్యలు లేవు. వారి ఇరువురి మధ్య కొట్లాటలు లేవు.« విద్యార్థులు స్ట్రైకులు చేసింది లేదు, ధర్నాలు చేసింది లేదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా లయోలా కళాశాల అటానమస్‌ను రద్దు చేయాలని కుట్రలు చేసిది లేదు. ప్రభుత్వ పెద్దల వద్దకు పరుగులు తీసింది లేదు. అటానమస్‌ను రద్దు చేయాలని ఒత్తిడి తీసుకొచ్చింది అంతకన్నా లేదు.
ఆంధ్రా లయోలా కళాశాలకు వచ్చిన సమస్యల్లా కాలేజీకి ఎలాంటి సంబంధం లేని వారితోనే. చదువుకుంటున్న విద్యార్థులతో కాదు. వయసు మళ్లిన వారితో. వయో వృద్ధులతోనే అసలు సమస్య వచ్చింది. ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొంది, శేష జీవితం గడుపుతున్న వారి నుంచే వచ్చింది. పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారితోనే చిక్కొచ్చి పడింది. పట్టుదలకు పోయారు. ఆంధ్రా లయోలా కళాశాల అటానమస్‌ను రద్దు చేయించేదాక నిద్ర పోలేదు.
వాకింగ్ వద్దే అసలు గొడవ వచ్చింది. వాకింగ్‌కి రావద్దని లయోలా కళాశాల యాజమాన్యం గేట్లు క్లోజ్ చేస్తే.. వాకింగ్ చేసుకునేందుకు అనుమతించాలని మూసిన గేట్ల వద్ద ధర్నాలు చేపట్టారు. ఒక రోజు.. రెండు రోజులు కాదు. ఏళ్ల తరబడి ఇది కొనసాగింది. కరోనాకు ముందు వరకు అంతా సజావుగానే సాగింది. వేలాది మంది వాకర్స్ వెళ్లి చక్కగా వాకింగ్ చేసుకుంటూ స్వచ్ఛమైన ప్రాణవాయువును ఆస్వాదించే వాళ్లు. దీని కోసం ఒక వాకింగ్ అసోసియేషన్ కూడా ఏర్పడింది. దాదాపు 3వేల మందికిపైగా వాకర్స్ ఇందులో ఉన్నారు. కరోనా సమయంలో వాకింగ్ చేయడానికి వీల్లేదని కళాశాల యాజమాన్యం అల్టిమేటం జారీ చేసింది. అందులో భాగంగా గేట్లను కోజ్ చేసేశారు. వాకింగ్ కోసం వచ్చే జనాల తాకిడి వల్ల కరోనా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉందనే భావనతో నాటి కరోనా ఇన్‌స్ట్రక్షన్స్ మేరకు వాకింగ్‌కు ఎవ్వరినీ అలౌ చేయకుండా గేట్లు క్లోజ్ చేసేశారు.
కరోనా వాతావరణ తగ్గి పోయి పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత వాకింగ్ చేసుకునేందుకు వాకర్స్ వెళ్లగా కళాశాల యాజమాన్యం మాత్రం గేట్లు ఓపెన్ చేసేందుకు ససేమిరా అనింది. కొద్ది రోజుల తర్వాత కొంత ప్రభుత్వ అధికారులకు మాత్రమే వాకింగ్ చేసుకునేందుకు అలౌ చేసింది. తక్కిన వారికి లోనికి వచ్చేందుకు నిరాకరించింది. దీంతో వాకర్స్ అంతా కలిసి «నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. అంతేకాకుండా తమను వాకింగ్ చేసుకోనివ్వడం లేదని విజయవాడ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు. విజయవాడ ప్రజాప్రతినిధుల వద్దకు కూడా ఈ పంచాయతీని తీసుకెళ్లారు. లయోలా కళాశాల యాజమాన్యం దృష్టికి ప్రజాప్రతినిధులు వాకర్స్ విషయాన్ని తీసుకెళ్లారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేశారు. అయినా కళాశాల యాజమాన్యం వాకింగ్ చేసుకునేందుకు అంగీకరించ లేదు. అప్పటి నుంచి నేటి వరకు ఈ తగాదా కొనసాగుతూనే ఉంది.
చివరికి ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. వాకింగ్ చేసుకునేందుకు వాకర్స్‌కు అవకాశం కల్పించే విధంగా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించ లేదు. దీంతో వాకర్స్ ఆంధ్రా లయోలా కళాశాల యాజమాన్యానికి తామంటే ఏమిటో, తమ ప్రతాపం అంటే ఏంటో చూపించాలని నిర్ణయించుకున్నారు. చివరికి ఆంధ్రా లయోలా కళాశాల అటానమస్‌ను రద్దు చేయించాలని నిర్ణయించుకున్నారు. అందుకు పావులు కదిపారు. కృష్ణా యూనివర్శిటీ పెద్దలను రంగంలోకి దింపింది. ఆంధ్రా లయోలా కళాశాలలో అకడమిక్, ఎగ్జామినేషన్స్, ఫైనాన్షియల్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలపై విచారణ చేపట్టాలని కృష్ణా యూనివర్శిటీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.
అందులో భాగంగా వీటి మీద విచారణ నిమిత్తం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టిన కమిటీ అనేక లోపాలను గుర్తించింది. యూజీసీ నియమ నిబంధనలను ఉల్లంఘించిందని నిర్ణయానికి వచ్చిన కృష్ణా యూనివర్శిటీ పెద్దలు ఆంధ్రా లయోలా కళాశాల అటానమస్‌ను ఆరు రోజుల క్రితం రద్దు చేసింది. స్వతంత్ర హోదాను రద్దు చేసి కృష్ణా యూనివర్శిటీ అనుబంధ కళాశాలగా ఆంధ్ర లయోలా కళాశాలను పరిగణించనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఆంధా లయోలా కళాశాలకు సంబంధించిన అకడమిక్, అడ్మినిస్ట్రేషన్, కోర్సులు, ఫీజుల వవరాలు, పరీక్షలకు సంబంధించిన డాక్యుమెంట్స్, సర్టిఫికేట్లును పది రోజుల్లో యూనివర్శిటీకి అప్పగించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మిగిలిన అఫిలియేటెడ్ కాలజీలతో పాటు విద్యార్థులకు పరీక్షలను నిర్వహించాలని కృష్ణా యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఆంధ్రా లయోలా కలాశాల యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేశారు. ఆంధ్రా లయోలా కళాశాల అటానమస్ హోదాను రద్దు చేయడానికి యూజీసీ నిబందనలను పాటించకపోవడమే కారణమని ఒక వైపు టాక్ వినిపిస్తోన్న.. మరో వైపు ఈ అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వాకింగ్ చేసుకునేందుకు వాకర్స్‌ను కళాశాల ప్రాంగణంలోకి అనుమతించక పోవడమే అసలైన కారణంగా ప్రచారం జరుగుతోంది. వాకర్స్‌ను వాకింగ్‌కు రాకుండా నిరాకరించడం, వారికి తగిన గౌరవం ఇవ్వకుండా చేసినందుకు ఇలా అటానమస్‌ను రద్దు చేయించారనే టాక్ వినిపిస్తోంది.