ఆరుగురు కలెక్టర్లు ఏమి చెప్పారంటే

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండవ రోజు 5వ జిల్లా కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది.

Update: 2025-12-18 07:01 GMT

సీఎం చంద్రబాబు అధ్యక్ష్యతన అమరావతి సచివాలయంలో ఐదవ కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. ఈ రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉత్తమ విధానాలు (best practices) విజయగాధలుపై ఆరుగురు జిల్లా కలెక్టర్ల ప్రెజెంటేషన్లు ఇచ్చారు.

ముందుగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఫౌండేషన్ లిటరసీ న్యూట్రిషన్ కు సంబందించిన కార్యక్రమం గురించి వివరిస్తూ మార్గదర్శి పేరిట కెరీర్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. యాస్పిరేషనల్ ఇంజన్ నిర్మాణ్ కింద 2023 నుండి అన్ని పాఠశాలల్లో సూపర్ 50 కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.యాప్ ఆధారిత టెస్టులు నిర్వహించడం ద్వారా విద్యార్థులు మంచి మార్కులు పోందేలా కృషి చేసినట్టు చెప్పారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లాలో ముస్తాబు పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు ఈకార్యక్రమం ఎంతో దోహద పడిందన్నారు.వారి ద్వారా వారి కుటుంబ సభ్యుల్లో వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుపడేందుకు అవకాశం కలిగిందన్నారు.
ముస్తాబు కార్యక్రమం కింద అన్ని పొఠశాలల్లో విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుక్కుని,తల సక్రమంగా దువ్వుకుని మాత్రమే పాఠశాల లోపలికి అనుమతించేలా ఆదేశాలు ఇచ్చామని ఇది మంచి ఫలితాలు వచ్చాయని, విద్యార్థులే కాక వారి కుటుంబాల్లో వ్యక్తి గత పరిశుభ్రత స్థాయి మెరుగు పడిందని వివరించారు.
దీనిపై సియం చంద్రబాబు స్పందిస్తూ ఇది మంచి వినూత్న కార్యక్రమని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని అభినందించారు.ఈవిధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ,ప్రవేట్ పాఠశాలలన్నిటిలో ప్రవేశ పెట్టడం జరుగుతుందని ప్రకటించారు.10 వ తరగతి వరకు అనగా సుమారు 79 లక్షల మంది విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత మెరుగు పరుచుకునేందుకు వీలుకలుతుందన్నారు.అంతేగాక ఆయా విద్యార్ధులకు చెందిన సుమారు 2 కోట్ల మందిలో ప్రభావం చూపుతుందని తెలిపారు.
ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీ జిల్లాల్లోని 16 మండలాల్లో ఐడి లిక్కర్ ప్రభావిత గ్రామాల్లోని 226 కుటుంబాలను గుర్తించి ప్రాజెక్టు మార్పు పేరిట కార్యక్రమాన్ని చేపట్టి వారిలో మద్యం అలవాటును దూరం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.వారికి లైవ్లీ హుడ్ కార్యక్రమం కింద బ్యాంకు రుణాలు అందించామని తెలిపారు.ఏలూరు జిల్లాను ఐడి లిక్కర్ రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందని చెప్పారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ షిమాన్షు శుక్ల రైతులకు సంబంధించి చాంపియన్ ఫార్మర్ పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.ముఖ్యంగా రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణ పట్ల పూర్తి అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందుకై 45 రకాల వివిధ యాంత్రీకరణ పనిముట్లను గుర్తించి వాటిపై రైతుల్లో అవగాహన కలిగించేందుకు తెలుగులో కరపత్రాలు ముద్రించి రైతులందరికీ సర్కులేట్ చేశామని వివరించారు.అదే విధంగా వేరుశెనగ కు వాల్యూ ఎడిసన్ కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
వైయస్సార్ కడప జిల్లా కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించి జిల్లాలో స్మార్ట్ కిచెన్ అనే వినూత్న కార్యక్రమాన్ని హబ్ అండ్ స్కోప్ విధానంలో అమలు చేస్తున్నట్టు వివరించారు.విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాదు మరియు కొంత మంది పౌష్ఠికాహార నిపుణుల సహకారంతో ఈవిధానాన్ని విజయవంతంగా అమలు చేయడం జరుగుతోందన్నారు.
ఈకార్యక్రమం విజయవంతంగా అమలుకు ప్రకృతి సేద్యం ద్వారా పంటలు సాగు చేసే రైతులను దీనితో టైప్ చేసి వివిధ రకాల కూరగాయలు స్మార్ట్ కిచెన్ కు నిరంతరం సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.ప్రతి మండలంలో ఈస్మార్ట్ కిచెన్ విధానం సమర్థవంతంగా అమలు జరిగేలా మండలాల వారీగా సబ్ కమిటీలను ఏర్పాటు చేసి విజయవంతంగా అమలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని వివరించారు.
ఈ అంశంపై సిఎం చంద్రబాబు నాయుడు స్పందించి ఇదొక మంచి వినూత్న కార్యక్రమని ఇది రాష్ట్రానికే గాక దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు.
చివరగా అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో రెవెన్యు రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.వివిధ రెవెన్యూ రికార్డులు అన్నిటినీ డిజిటలైజేషన్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.
Tags:    

Similar News