శ్రీవారి ఆలయం ముందు.. అలిపిరి వద్ద భద్రత డొల్ల..
తిరుమలలో రెపరెపలాడిన ఏఐఏడీఎంకే బ్యానర్..
Byline : SSV Bhaskar Rao
Update: 2025-12-18 08:07 GMT
నాయకులపై ఉన్న అభిమానంతో తమిళనాడు ఏఐఏడీఎంకే ( AIADMK ) విద్యార్థి విభాగం నాయకులు చిక్కులో పడ్డారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట తమిళనాడు ( Tamil Nadu ) మాజీ సీఎం ఎడపాటి పలని స్వామి, మాజీ సీఎం జయలలిత ( Jayalalithaa )పేరిట ఉన్న భారీ బ్యానర్ను ప్రదర్శించడం ద్వారా కొందరు యువకులు ఇబ్బందుల్లో పడ్డారు.
తిరుమల తో పాటు అలిపిరి చెక్ పాయింట్ వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఏర్పాటు చేస్తున్నట్లు టిటిడి యంత్రాంగం పదే పదే చెబుతోంది. తిరుమలలో తమిళనాడు యువకులు ప్రదర్శించిన బ్యానర్ ద్వారా అలిపిరి చెక్పోస్ట్ వద్ద వైపల్యం మరోసారి కనిపించింది.
తిరుమల శ్రీవారి ఆలయం ముందే తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన ఏఐఏడీఎంకే ( All India Anna Dravida Munnetra Kazhagam )విద్యార్థి విభాగం నాయకులు ప్రదర్శించిన భారీ బ్యానర్ భద్రత వైఫల్యాన్ని.
"నిబంధనలు అతిక్రమించిన తమిళ యువకుల పై చర్యలు తీసుకుంటాం" అని టిటిడి అధికారులు ప్రకటించారు.
"తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీవారి ఆలయ పరిసరాల్లో రాజకీయ నాయకుల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీ బ్యానర్ ను టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ప్రదర్శించినట్లు మా దృష్టికి వచ్చింది. ఆ బ్యానర్ ను ప్రదర్శించడమే కాకుండా రీల్స్ తీసి సోషియల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిసింది.ఆ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తీసుకుంటాం" అని టీటీడీ ( TTD ) చీఫ్ pro తలారి రవి జారీచేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.
తమిళనాడులోని మధురై (Madurai ) జిల్లా తిరుప్పారగుండ్రం అసెంబ్లీ స్థానానికి చెందిన ఏఐఏడీఎంకే విద్యార్థి విభాగం నాయకులు తిరుమలకు వచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న గొల్ల మండపం ఎదురుగా భారీ బ్యానర్ ని సినిమా స్టైల్ లో ప్రదర్శిస్తూ రీల్స్ చేసేందుకు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది భారీగా వైరల్ అయింది.
తనిఖీలు డొల్ల
తిరుమలకు వెళ్లడానికి అలిపిరి సమీపంలో ఉన్న తనిఖీ కేంద్రం వద్ద ప్రతి వాహనాన్ని, యాత్రికుల లగేజీని సునిసితంగా తనిఖీ చేస్తారు. దీనికోసం టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ( TTD Vigilance and Security Department ) సిబ్బంది 12 లైన్లలో ఉన్న తనకి పాయింట్లు మెటల్ డిటెక్టర్ లతోపాటు, స్కానింగ్ యంత్రాల ద్వారా తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా వ్యవస్థ ఉంది. ఇంతటి భద్రత చర్యల నుంచే తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరగుండ్రం ప్రాంతానికి చెందిన ఏఐడీఎంకే విద్యార్థి విభాగం నాయకులు భారీ బ్యానర్ను తీసుకుని వెళ్లడం కనిపెట్టలేకపోయారు.
"త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో ఏఐడీఎంకే అధికారంలోకి రావాలని.. ఎడపాటి పళని స్వామి ముఖ్యమంత్రి కావాలి" అని తమిళంలో రాసిన భారీ బ్యానర్ లో మాజీ ముఖ్యమంత్రి పలని స్వామి సీఎం, ఏఐఏడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మధురై జిల్లాకు చెందిన ఆ పార్టీ మాజీ మంత్రుల ఫోటోలతో ఉన్న భారీ బ్యానర్ను ఏఐఏడిఎంకె విద్యార్థి విభాగం నాయకులు ప్రదర్శించారు.
అలిపిరి చెక్ పోస్ట్ తర్వాత తిరుమల ఆలయ పరిసరాల్లో కూడా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో పనిచేసే సిబ్బంది కూడా కనిపెట్టలేకపోయారు. అక్కడ బ్యానర్ ప్రదర్శించడం అని చెప్పడం కంటే, ఇలా చేయకుండా ఆంక్షలు అమలు చేయడంలో భద్రతాసింది. వైఫల్యం మరోసారి బయటపడింది. సాధారణంగా మీడియా ప్రతినిధులు ఆలయ పరిసర ప్రాంతాల్లో వార్తా సేకరణ కోసం వీడియో తీస్తుంటేనే అభ్యంతరం చెప్పే భద్రతా సిబ్బంది ఏమయ్యారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.