సుప్రీం ఓకే అంటే సీబీఐ సిద్ధం– వివేకా హత్య కేసులో కొత్త మలుపు

నిందితుల బెయిల్ రద్దు పిటిషన్‌పై ట్రయల్ కోర్టు నిర్ణయం వచ్చే వరకు వాయిదా;

Update: 2025-09-16 12:56 GMT
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. నిందితులకు బెయిల్ రద్దు చేయాలని ఒకరంటుంటే మరొకరు విచారణకు సిద్ధమేనంటూ సుప్రీంకోర్టుకు తెలిపారు. జరిగింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు బెయిల్ రద్దు పిటీషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత తరఫున వాదించిన సిద్ధార్థ లూథ్రా ఈ కేసులో నిందితులందరికీ బెయిల్ రద్దు చేయాలంటూ సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఆ తర్వాత అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు సీబీఐ తరఫు వాదనలు వినిపిస్తూ తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సీబీఐ సిద్ధంగా ఉందన్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరుతున్నారని, అందుకు కోర్టు తగిన ఆదేశాలు ఇస్తే.. దర్యాప్తు కొనసాగించేందుకు సీబీఐ సిద్ధమన్నారు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు.

అందరి వాదనలు విన్న ధర్మాసనం.. సీబీఐ దర్యాప్తు విషయంలో ట్రయల్‌ కోర్టులో మరో పిటిషన్‌ వేయాలని సునీతకు సూచించింది. రెండు వారాల్లో పిటిషన్‌ దాఖలు చేసేందుకు అనుమతించింది. పిటిషన్‌ వేసిన 8 వారాల్లో మెరిట్స్‌ ఆధారంగా నిర్ణయం ప్రకటించాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించింది. ట్రయల్‌ కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు అన్ని బెయిల్‌ రద్దు పిటిషన్లపై విచారణలను వాయిదా వేసింది.
Tags:    

Similar News