విజయవాడ వరద ముంపు ప్రాంతాలివే..

ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన వరదల్లో విజయవాడ పట్టణం విలవిల్లాడింది. పట్టణంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ముంపుకు గురయ్యాయి. ఆప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి..

Update: 2024-09-09 10:18 GMT

బుడమేరు ముంపు బాధిత ప్రాంతాలు

బుడమేరు ప్రాజెక్టు కింద ప్రధానంగా అజిత్ సింగ్ నగర్, రామక్రిష్ణాపురం, అయోధ్య నగర్, బుడమేరు మద్దికట్ట, ముత్యాలంపాడు, మధురానగర్, న్యూ రాజరాజేశ్వరావుపేట, ఓల్డ్ రాజరాజేశ్వరావు పేట, ఇందిరా నాయక్ నగర్, తోటవారి వీధి, సుందరయ్య నగర్, ఎల్బీఎస్ నగర్, పాయకాపురం, రాధానగర్, ఉడా కాలనీ, రాజీవ్ నగర్, కండ్రిక, శాంతినగర్, ప్రశాంతి నగర్, పైపుల రోడ్డు, పిఎన్టీ కాలనీ, వశిష్ట కాలనీ, వాంబే కాలనీ (ఎ బ్లాక్ నుంచి జి బ్లాక్ వరకు), డాబాకొట్ల సెంటర్, లూనా సెంటర్, ఆంధ్రప్రభ కాలనీ, సుబ్బరాజు నగర్, ప్రగతి నగర్, ప్రజాశక్తి నగర్, జర్నలిస్ట్ కాలనీ, జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ, గుణదల, రామవరప్పాడు, భవానీపురం, విద్యాధరపురం, కబేళా, కుమ్మరిపాలెం, లేబర్ కాలనీ, చిట్టినగర్, వించ్ పేట, రైల్వేస్టేషన్, మిల్క్ ప్రాజెక్టు ఏరియా, టైనర్ పేట, కొత్తపేట, కుమ్మరిపాలెం జంక్షన్, సితార సర్కిల్, రెడ్డికొట్టు వీధి, కొత్త మసీదు వీధి, పాత మసీదు వీధి, సాయిబాబా గుడి సెంటర్, బీరువాల కంపెనీ రోడ్డు, అమరావతి నగర్, నిజాంపేట, పంజా సెంటర్, గాంధీబొమ్మ సెంటర్ లు మునిగాయి. ఇవే కాకుండా పలు చిన్న కాలనీలు కూడా ముంపుకు గురయ్యాయి.

క్రిష్ణానది వరదలకు...

క్రిష్టానది వరదకు క్రిష్ణలంకలోని భ్రమరాంబపురం, సత్యంగారి హోటల్ ఏరియా, రణదీవె నగర్, రాణిగారి తోట, భూపేష్ గుప్తా నగర్, బాలాజీ నగర్, పోలీస్ కాలనీ, కళానగర్, పూర్ణచంద్రనగర్, రామలింగేశ్వర నగర్, ఈనాడు కాలనీ, శివపార్వతి నగర్, యనమల కుదురు వంటి ప్రాంతాలు మునిగాయి. క్రిష్ణా వరదకు క్రిష్ణా తీరం వెంట ఉండే క్రిష్ణలంక పూర్తిగా మునిగింది.

బుడమేరు నుంచి వరద నీరు ప్రస్తుతం సుమారు ఒక టీఎంసీ వరకు కాలనీల్లో ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. క్రిష్ణా రివర్ నుంచి వచ్చిన వరద నీరు నాలుగో రోజుకు పూర్తిగా వెనక్కి తగ్గింది. బుడమేరు వరద నీరు కాలనీల్లో నుంచి బయటకు పోయేందుకు వీలు లేక అక్కడే నిలిచింది.

సుమారు 5లక్షల మంది ప్రజలు వరద ముంపుకు గురైనట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఆదివారం నుంచి నష్టం అంచనా బ్రుంధాలు వీధుల్లో తిరుగుతున్నాయి. 1,700 బ్రుంధాలను ఎన్యుమరేషన్ కు నియమించినట్లు మునిసిపల్ మినిస్టర్ నారాయణ తెలిపారు. ముంపుకు గురైన ప్రాంతాల్లోని ఇండ్ల వారికి బియ్యం, కందిపప్పు, ఇతర నిత్యావసరాలు ప్రభుత్వం ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని చేపట్టింది.

Tags:    

Similar News