వల్లభనేని వంశీ అక్రమాలకు పాల్పడ్డాడు..నిగ్గు తేల్చండి

విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వంశీకి సంబంధించి రెండు కీలక ఆదేశాలు జారీ చేసింది.;

By :  Admin
Update: 2025-02-24 13:09 GMT

గవన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆయనను అరెస్టు చేసిన జైల్లో పెట్టిన కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. గత ప్రభుత్వ హయాంలో వల్లభనేని వంశీ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, వాటన్నింటిపైన సమగ్ర దర్యాప్తు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. ఆ మేకు కూటమి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌తో పాటు భూకబ్జాలకు వంశీ పాల్పడ్డారని, ఇలాంటి వాటిపైన ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం సిట్‌ అధికారులను ఆదేశించింది. నలుగురు సభ్యులున్న ఈ సిట్‌కు సీనియర్‌ పోలీసు అధికారి జీవీజీ అశోక్‌ కుమార్‌ హెడ్‌గా అపాయింట్‌ చేసింది. గత ప్రభుత్వంలో వంశీ చేసిన అక్రమాల వల్ల రూ. 195 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. పోలీసులు కోరిన విధంగా వంశీని పోలీసుల కస్టడీకి అప్పగించాలని కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతులు జారీ చేసింది. న్యాయవాది సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వల్లభనేని వంశీని విచారణ చేపట్టాలని పోలీసులకు న్యాయస్థానం సూచించింది. దీంతో పాటుగా వంశీ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు, నేల మీద పడుకోలేక పోతున్నాడు అనే దానిపైన కోర్టు స్పందించింది. వంశీకి బెడ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు కోర్టు అనుమతించింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ రిమాండ్‌ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నాడు.
Tags:    

Similar News