TTD | 'వైష్ణవ యాత్రాస్' ఇదో.. నకిలీ వెబ్ సైట్
యాత్రికులు అధికార వెబ్ సైట్ లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది.;
By : SSV Bhaskar Rao
Update: 2025-07-01 14:52 GMT
తిరుమల శ్రీవారి దర్శనంలో యాత్రికుల సెంటిమెంట్ ను సొమ్ము చేసుకోవడానికి నకిలీ సోషల్ మీడియా సైట్లు, వ్యక్తులు ఎత్తులు వేస్తూనే ఉన్నారు. ఆ కోవకు చెందిన శ్రీవారి దర్శనం కల్పిస్తామని పెద్దింటి ప్రభాకరాచార్యులు పేరిట "వైష్ణవ యాత్రాస్" ఉన్న ఫేస్ బుక్ (Face Book) పేజీ నకిలీది. దానిని యాత్రికులు నమ్మవద్దని టీటీడీ యాత్రికులను అప్రమత్తం చేసింది.
తిరుమల శ్రీవారి దర్శనం, సేవల కోసం అధికారిక వెబ్ సైట్ సేవలు మాత్రమే వినియోగించుకోవాలని టీటీడీ యాత్రికులకు సూచించింది. శ్రీవారి దర్శనం, సేవలు అందుబాటులో ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రకటనలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది.
"వైష్ణవ యాత్రాస్" పేరిట పెద్దింటి ప్రభాకరాచార్యులు అనే వ్యక్తి ఫేస్ బుక్ పేజీ నకిలీదని టీటీడీ స్పష్టం చేసింది. ఆ సైట్
ద్వారా శ్రీవారి దర్శనం, వసతి కల్పిస్తామని యాత్రికులను మోసగించడానికి ఓ పేజీ నిర్వహిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ సమాచార పౌరసంబంధాల శాఖ చీఫ్ పీఆర్ఓ తలారి రవి విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయం తెలిపారు.
"వైష్ణవ యాత్రాస్ పేరిట శ్రీవారి అభిషేకం, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మంజూరు చేయిస్తా" అని పెద్దింటి ప్రభాకరాచార్యులు అనే వ్యక్తి ఫేస్ లో నిర్వహిస్తున్న పేజీని విశ్వసించవద్దని చీఫ్ పీఆర్ఓ రవి యాత్రికులను హెచ్చరించారు.
ఇలాంటి నకిలీ వ్యక్తులు, వెబ్ సైట్ (Web Site) అను నమ్మవద్దని ఆయన సూచించారు. శ్రీవారి దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.