Tirumala | స్థానికులకు వైకుంఠ ద్వార దర్శనం..
డిసెంబర్ 27 నుంచి 29 వరకు ఈ-డిప్ మోదుకు అవకాశం
Byline : SSV Bhaskar Rao
Update: 2025-12-11 16:01 GMT
డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్
31 వ తేదీ ఈ డిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతి, తిరుమల స్థానికులకు టీటీడీ అవకాశం కల్పించింది. ఈ డిప్ లో టోకెన్లు కేటాయించనుంది. దీని కోసం ఈ నెల 27 వ తేదీ నుంచి నమోదుకు చేసుకోవచ్చు. ఎంపిక చేసిన వారికి 31 వ తేదీ వాట్సప్ కు మెజేస్ పంపిస్తారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు పాత పద్ధతికి స్వచ్చి చెప్పి, ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా 2026 జనవరి 6, 7, 8వ తేదీల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇస్తూ టోకెన్లు కేటాయించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి, ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద రోజుకు ఐదు వేల టోకెన్లు కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
రిజిస్ట్రేషన్
తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుపతి స్థానికలు డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 29 వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఈ- డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించింది. తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన స్థానికులుకు ఆ జనవరి ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు 1+3 విధానంలో ఈ-డిప్ కోసం టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
డిసెంబర్ 31న మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్నష్టం చేశారు. ఇందులో రోజుకు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు 4500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు చొప్పున కేటాయించనున్నారు. స్థానికులు టోకెన్ల కోసం ఈ-డిప్ ద్వారా నమోదు చేసుకోవాలని టీటీడీ సూచించింది.