Tourism| పర్యాటకం రెక్కలు విరిచిన టీటీడీ నిర్ణయం

శ్రీవారి దర్శనం రూ. 300 టికెట్ ప్యాకేజీ టూర్ కోటా టీటీడీ రద్దు చేసింది. ఇది టూరిజం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసేలా కనిపిస్తోంది.

Update: 2024-11-23 12:46 GMT

రాష్ట్రంలో పర్యాటకం రంగాన్ని కొత్తపుంతలు తొక్కించడానికి సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తిరుమల ప్యాకేజీ టూర్ కోటాను టీటీడీ పాలకమండలి రద్దు చేయడం ద్వారా ఆ రంగాన్ని దెబ్బతీసేలా కనిపిస్తోంది.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆరు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలతోపాటు పర్యాటక శాఖ ప్యాకేజ్ టూర్లు అందుబాటులో ఉంచాయి. వీటితో పాటు రైల్వే శాఖ కూడా ఐఆఆర్ సీటీసీ (IRCTC) ద్వారా యాత్రికులకు తిరుమల స్వామివారి దర్శనం ప్యాకేజీ అమలు చేస్తోంది.
"పర్యాటక శాఖ లో ఏజెంట్ల చేతిలో యాత్రికులు మోసపోతున్నారు" అనే ఆరోపణలతో ఆ ప్యాకేజీలను టీటీడీ రద్దు చేసింది. ఆ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. "డిసెంబర్ 1వ తేదీ నుంచి రద్దు చేస్తున్నాం" టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు ప్రకటించారు.

పర్యాటక రంగానికి నష్టమేనా..
టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయం కారణంగా ఆరు రాష్ట్రాల ప్రజా రవాణా సంస్థలతోపాటు, పర్యాటక అభివృద్ధి సంస్థల మనుగడను దెబ్బతీసినట్లే కనిపిస్తోంది.
ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ (Apsrtc), ఏపీటీడీసీ (Aptdc) తోపాటు కర్ణాటక, తమిళనాడు, గోవా, పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని రవాణా, పర్యాటక శాఖలకు టీటీడీ ఆన్లైన్ కోటా కేటాయించి. తిరుమల శ్రీవారి దర్శనానికి అవసరమైన రు. 300 టికెట్ల కోటా రెండు దశాబ్దాలుగా వారికి అందుబాటులో ఉంచారు.

శ్రీవారి దర్శనం రూ. 300 కోటా..
దక్షిణ భారతదేశంలోని ప్రజారమణ సంస్థలు, పర్యాటక శాఖల అభివృద్ధికి శ్రీవారి రు. 300 టికెట్ కోటాను కేటాయించారు. అందులో..
1. ఏపీఎస్ఆర్టీసీకి 1,000 టికెట్లు
ఏపీ టీడీసీకి 1000 టికెట్లు
2. తమిళనాడు ఆర్టీసీకి 1000
తమిళనాడు పర్యాటక శాఖకు 350
3. తెలంగాణ ఆర్టీసీకి 1000
పర్యాటక శాఖకు 350
4. గోవా పర్యాటక శాఖకు వంద (ఈ పర్యాటకశాఖ బెంగళూరు నుంచి తిరుపతికి బస్సులు నడుపుతుంది)
5. కర్ణాటక ఆర్టీసీకి 500
పర్యాటకశాఖకు 200
6. పుదుచ్చేరి పర్యటకశాఖకు 100 టికెట్లు కోటా ఇచ్చారు.
మొత్తం ఇవన్నీ కలిపితే 5,500 శ్రీవారి దర్శనం టికెట్లు ఆ సంస్థలకు టీటీడీ కోటా కేటాయించింది. ఇవన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే ఏజెంట్లు కేవలం టికెట్ బుక్ చేయడానికి వీలుకాదు. అలా చేస్తే మాత్రం ప్యాకేజీలోని బస్సుచార్జీతో సహా అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది.
"కేవలం శ్రీవారి దర్శనానికి 300 రూపాయల టికెట్ మాత్రమే తీసుకునే వెసులుబాటు ఈ వెబ్సైట్లో అందుబాటులో లేదు" అని ఏపీటీడీసీ తిరుపతి రిజర్వేషన్ కౌంటర్ ఇన్చార్జి ప్రసాద్ స్పష్టం చేశారు. దీనిపై విజయవాడలోని ఉన్నతాధికారులే స్పందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. డివిజనల్ మేనేజర్ (Dvm) ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో మాట్లాడేందుకు అందుబాటులో లేరు.
ప్రభుత్వ సంస్థలకు దెబ్బ
టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రజా రవాణా సంస్థలే కాకుండా, పర్యాకటకశాఖ మనగడకు కూడా దెబ్బ తగిలినట్లే భావిస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి సంబంధించి 300 రూపాయల టికెట్ కోటా రద్దు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థకు నెలకు నాలుగు కోట్ల రూపాయాల ఆదాయం పోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీటీడీసీకి రాష్ట్రంలోని హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, తమిళనాడులోని చెన్పై, సేలం, కోయంబత్తూరు నుంచి అద్దె బస్సులు తిరుమల ప్యాకేజీ టూర్ కోసం నడుపుతున్నారు. ఏపీటీడీసీలో సొంత బస్సులు తక్కువగా ఉండటం వల్ల, ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకున్న బస్సులను నడుపుతూ, యజమానులకు అద్దె చెల్లిస్తున్నారు.
దీనిపై ఏపీటీడీసీ (Aptdc)కి తిరుపతిలో ఏజెంట్ ఎం. మల్లికార్జున ఏమంటున్నారంటే..
"సార్, నేను ఒక బస్సు పర్యాటక శాఖకు అద్దెకు ఇచ్చారు. బెంగళూరు- తిరుపతి మధ్య ఈ బస్సు నడుస్తుంది. ఈ రూట్లో అదే మాత్రమే నాకు చెల్లిస్తారు" అని 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
"ఒకవేళ నా కుటుంబసభ్యులు, లేదా స్నేహితుల కోసం అయినా సరే. టికెట్ బుక్ చేస్తే ప్యాకేజీ కోసం నిర్ణయించిన రు. 2, 360 అల్ట్రా ఏసీ బస్సు, ఓల్వో ప్యాకేజీ ధర రూ. 2,160 నా అకౌంట్ నుంచి వెళ్ళిపోతుంది" అని మల్లికార్జున విశ్లేషిస్తున్నారు. వెబ్ సైట్ (Web Site)లో మార్చడానికి సాధ్యం అవుతుందా? దోపిడీకి ఆస్కారం ఎక్కడ ఉందనేది ఆయన ప్రశ్న.
పర్యాటక శాఖకు 4 కోట్లు నష్టం

తిరుమల ప్యాకేజీ టూర్ నుంచి ఏపీటీడీసీని తప్పించడం వల్ల ఆ సంస్థకు నెలకు నాలుగు కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమల ప్యాకేజీ టూర్ వల్ల ఈ ఏడాది మార్చి నెల నుంచి ఏపీటీడీసీకి ప్రతి నెలా రు. నాలుగు కోట్లు లాభం వచ్చినట్లు సమాచారం.
విజయవాడలోని ప్రధాన కార్యాలయం తోపాటు ప్రధాన నగరాల్లోని కార్యాలయాల నిర్వహణ, సిబ్బంది వేతనాలు చెల్లించిన తరువాత ఆ సంస్థ లాభాల దిశలోనే ప్రయాణం సాగించిందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగంలోని రవాణా, పర్యాటక శాఖ కు కేటాయించిన ప్యాకేజీ టూర్లను టీటీడీ రద్దు చేయడం వల్ల ఆ సంస్థల మనుగడకు దెబ్బ తగిలిందని అంచనా వేస్తున్నారు.
ఈ ప్యాకేజీపై ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి రీజియన్ మేనేజర్ జగదీష్ మాట్లాడారు. "ఏపీలోనే కాదు. తమిళనాడు నుంచి కూడా మాకు కోటా ఆన్ లైన్ లో కేటాయించారు. దీనివల్ల లాభ,నష్టాలు ఏమీ లేవు" అని ఆర్ఎం చెప్పారు. "మేము బస్సు చార్జీతో పాటు శ్రీవారి శీఘ్రదర్శనానికి సంబంధించి, రూ. 300 టికెట్ అవసరమైన వారు ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదు" అని ఆర్ఎం జగదీష్ వివరించార.
ప్రభుత్వ రవాణా రంగం, పర్యాటకశాఖకు ఇచ్చిన ప్యాకేజీలో అవినీతికి ఆస్కారం ఏర్పడింది. అని టీటీడీ చెబుతున్నట్లు ఒక అంశాన్నిపరిశీలిస్తే దోపిడీకి ఆస్కారం ఉందా? లేదా? అనేది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
చార్జీ ఎంత? ఖర్చయ్యేది ఎంత??
తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీటీడీసీ ప్యాకేజ్ టూర్ అందిస్తుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి తీసుకుని రావడం. దర్శనం తర్వాత అదే రోజు రాత్రి వారిని హైదరాబాద్కు తీసుకుని వెళ్తారు. ఇందుకోసం ఒక ప్యాసింజర్ నుంచి రు. 4,400 ప్యాకేజీ టూర్ కింద వసూలు చేస్తున్నారు. ఇందులో బస్సు చార్జీనే 3 వేల రూపాయలు అవుతుంది.
ఏపీఎస్ఆర్టీసీలో తిరుపతి నుంచి హైదరాబాదుకు ఏసీ ఓల్వో బస్సులో టికెట్ రు. 1,680 వసూలు చేస్తున్నారు. వెళ్లి రావడానికి కేవలం బస్ చార్జీనే రు. 3,360 అవుతుందనేది జగమెరిగిన సత్యం. అయితే
తిరుమలకు టూర్ ప్యాకేజీ అందిస్తున్న ఏపీటీడీసీ ఒక ప్రయాణికుడి నుంచి రు. 4,400 వసూలు చేస్తోంది. ఇది కేవలం చార్జీ మాత్రమే కాదు. శ్రీవారి దర్శనం టికెట్ తో పాటు ప్రయాణికుడికి వసతి అల్పాహారం భోజనం వంటి సదుపాయాలు కల్పించడం వల్ల రు.3,870 ఖర్చు చేస్తోంది. అది ఎలాగంటే..
హైదరాబాదు నుంచి సాయంత్రం బయలుదేరి ఏపీ టీడీపీ బస్సు ఉదయం 5 గంటలకు తిరుపతికి చేరుతుంది. వారిని ఓ గైడ్ పికప్ చేసుకుంటారు. కపిలతీర్థం సమీపంలోని దాల్మియా (Dhalmiya), తిరుచానూరు సమీపంలోని టూ స్టార్ హోటల్ కు సమానమైన గదుల్లో వససతి కల్పిస్తారు. వారందరూ ఫ్రెషప్ కాగానే.. Aptdc బస్సులో.. తీసుకొని వెళ్లి..

1. తిరుచానూరు అమ్మవారి దర్శనం
2. కపిరేతీర్థంలో కపిలేశ్వరుని దర్శనం
3. తిరుమల కొండకు ఏసీ బస్సులో ప్రయాణం
ఒక ప్రయాణికుడికి తిరుపతి నుంచి తిరుమల, తిరుమల నుంచి తిరుపతికి రు. 200 టికెట్ (ఇది ప్యాకేజీ లో భాగమే)
4. తిరుమలలో టూరిజం హోటల్ సమీపంలో తలనీలాలు సమర్పించే ఏర్పాటు.
5. టూరిజం హోటల్ లోనే అల్పాహారం (రు. 120. ఇడ్లీ, ఉప్మా, పొంగలి, వడ, చెట్ని, సాంబార్ అందుబాటులో ఉంటుంది. ఇది ప్యాకేజీలో భాగమే.
6. ఉదయం 11 గంటలకు శ్రీవారి దర్శనం (రు. 300 టికెట్ . ఇది ప్యాకేజీలో భాగమే)
7. దర్శనం తర్వాత టూరిజం హోటల్లో మధ్యాహ్నం భోజనం (రు. 150. ఇది ప్యాకేజీలో భాగమే)
8. ఆ తర్వాత మళ్లీ కొండకు వెళ్లిన బస్సులోనే తిరుపతికి తిరుగు ప్రయాణం.
9. రిఫ్రెష్ కావడం ద్వారా మళ్లీ హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. రాత్రి భోజనం మాత్రం ఆ ప్రయాణికుడే భరించుకోవాలి.
కర్ణాటక ప్రభుత్వం నుంచి..
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు తిరుమల శ్రీవారి శీఘ్రదర్శనం 300 రూపాయల కోట 500 టికెట్ కేటాయించారు. పర్యాటక శాఖకు 200 టికెట్ టికెట్ ఇచ్చారు.
బెంగళూరు నుంచి తిరుపతికి రావడానికి అల్ట్రా ఏసీ బస్సులో రు. 2,360 పాయలకు ఒక ప్యాకేజీ, వోల్వో స్లీపర్ బస్సులో 2,760 రూపాయలకు మరో ప్యాకేజీ అమలు చేస్తున్నారు.
ఏపీటీడీసీలో ఏ తరహా వసతులు కల్పిస్తారో కర్ణాటక కార్పొరేషన్ కూడా అదే తరహాలో యాత్రికులకు సేవలు అందిస్తుంది.
గోవా పర్యాటక శాఖ కూడా తమ వెబ్సైట్ లో బుక్ చేసుకున్న యాత్రికులకు బెంగళూరు నుంచి తిరుపతికి సీ బర్డ్ (sea bird) ac బస్సులు నడుపుతోంది.
బస్సులు తక్కువ కావడంతో..
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (aptdc) లో సొంత బస్సులు తక్కువగా ఉండటం వల్ల, అద్దె బస్సులను తీసుకుంది. చాలామంది యువతకు ఇది ఉపాధిగా మారడమే కాకుండా వారే, ఆ సంస్థకు ఏజెంట్లుగా కూడా పనిచేస్తున్నారు. ఈ పద్ధతి జాయింట్ పోర్టర్ మోడ్ (Jpm) లో దీర్ఘకాలంగా అమలు చేస్తున్నారని ఏపీటీడీసీ తిరుపతి ఏజెంట్ మల్లికార్జున చెబుతున్నారు. "అది ఏపీ అయినా పొడుపు రాష్ట్రాలైనా సరే. ప్రైవేట్ బస్సులో యజమానులకు ముందస్తుగా కుదుర్చుకున్న అగ్రిమెంట్ మేరకు అద్దె మాత్రమే చెల్లిస్తారు. మినహా ఇందులో అవినీతిక ఆస్కారం లేదు" అనేది మల్లికార్జున అభిప్రాయం. అంతేకాకుండా, ఈ "ప్యాకేజీ టూర్ వల్ల ఆర్టీసీ, పర్యాటకశాఖలు ఆర్థికంగా సమృద్ధిని సాధించాయి" అని కూడా ఆయన విశ్లేషించారు.
తీవ్ర నష్టం..
టిటిడి పాలకమండలి ప్యాకేజీ టూర్లను రద్దు చేస్తూ ఆర్టీసీ, పర్యాటకశాఖ కేటాయించిన కోటాను రద్దు చేసింది. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఇది అమలులోకి తీసుకురానున్నారు. దీనివల్ల ఆరు రాష్ట్రాలకు సంబంధించిన పర్యాటక శాఖ బస్సులతో పాటు, వారు అధ్యక్షా ప్రైవేటు వ్యక్తులకు చెందిన 137 బస్సులు ఆగిపోనున్నాయి. ఆ కోవలో ఏపీ, తమిళనాడు,కర్ణాటక, పుదుచ్చేరి, గోవా రాష్ట్రాల బస్సులు కూడా ఉండడంవల్ల కొన్ని వందల మంది డ్రైవర్లు, క్లీనర్ల ఉపాధి గండి పడే పరిస్థితి ఏర్పడింది.
Tags:    

Similar News