సుబ్బరాయుడికి మళ్లీ తిరుపతి ఎస్పీ పోస్టింగ్ ఇచ్చారేంటీ!
తిరుపతి తొక్కిసలాట ఘటనతో బదిలీ, 8 నెలల తర్వాత మళ్లీ అదే పోస్టింగ్;
By : The Federal
Update: 2025-09-13 14:42 GMT
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల క్యూలో తొక్కిసలాటకు బాధ్యుడంటూ సర్కార్ ఆగ్రహానికి గురైన ఎస్పీ సుబ్బరాయుణ్ణి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కనికరించారు. తిరిగి ఆయన్ను తిరుపతి ఎస్పీగా నియమించారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల క్యూలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు. ఈ ఘటనకు బాధ్యులైన DSP రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. SP సుబ్బరాయుణ్ణి బదిలీ చేశారు.
తాజా బదిలీల్లో తిరుపతి ఎస్పీగా మళ్ళీ సుబ్బారాయుడిని చంద్రబాబు సర్కార్ నియమించింది. సుబ్బారాయుడు నిర్లక్ష్యం, అసమర్థతో ఆరుగురు భక్తులు మృతి చెందారని ఆనాడు భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడాయన్ని తిరిగి అదే చోట నియమించింది.
ఈ ఏడాది జనవరి 9న వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల క్యూలో తొక్కిసలాట జరిగింది. సీఎం చంద్రబాబు సెక్యూరిటీ అధికారిగా సుబ్బారాయుడు గతంలో పని చేశారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి కోసం సుబ్బారాయుడిని పిలిపించారు. తెలంగాణలో పని చేస్తున్న సుబ్బరాయుణ్ణి ఏపీకి రప్పించి తిరుపతి ఎస్పీ పోస్టు ఇచ్చారు. ఆ తర్వాత తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఎస్పీని ట్రాన్స్ పర్ చేయకుండా ఇతరులపై చర్య తీసుకుంటే చెడ్డపేరు వస్తుందని భావించిన ముఖ్యమంత్రి తిరుపతిలో చోటు చేసుకున్న విషాదానికి ఓ డీఎస్పీ, గోశాల డైరెక్టర్ బాధ్యులంటూ సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి జేఈవో గౌతమిని బదిలీ చేశారు.
ఆయన తెలంగాణ క్యాడర్‌కు చెందిన వారు. డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చి తిరుపతి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. మళ్లీ ఆయనకు తిరుపతి ఎస్పీగా రీ పోస్టింగ్ ఇచ్చారు.