Tirumala Police | ఖాకీలు దిద్దిన కల్లోల కాపురం

పోలీసులు ఓ మహిళను ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడారు. ఇద్దరు పిల్లలకు ఆ తల్లిని దగ్గర చేశారు. తిరుమలలో ఈ ఆపరేషన్ ఎలా సాగిందంటే..

Update: 2024-11-30 08:52 GMT

కుటుంబ కలహాలతో ఓ మహిళ తిరుమలకు వచ్చింది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబీలకు వీడియో సందేశం పంపింది. కొద్దిసేపటికే బెంగళూరు నుంచి తిరుపతి పోలీస్ కంట్రోల్ రూంకు కాల్ వచ్చింది. అతని గొంతులో ఆందోళన, ఏడుపు.. "మా చెల్లెలిని కాపాడండి సార్.. అని రోధిస్తూ అభ్యర్థన" దీంతో

 అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సహకారం తీసుకున్నారు. క్షణాల వ్యవధిలో ఆ మహిళ లోకేషన్ గుర్తించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆమెను తిరుమలలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యలు ఏమాతర్ం ఆలస్యమై ఉన్నా ఇద్దరు పిల్లలు తమ తల్లిని కోల్పోయ ఉండే వారు. ఇది జరగకుండా చేపట్టిన రెస్క్యూ ఆపరేషషన్ పూర్తి వివరాల్లోకి వెళితే..
అది నారావారిపల్లె. సీఎం చంద్రబాబు తన స్వగ్రామంలో ఉన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆ బందోబస్తులో తలమునకలవుతున్నారు. వారిలో ఓ అధికారి తిరుమల టూ టౌన్ సీఐ ఏ. శ్రీరాములు. సీఎం బందోబస్తు అంటే మాటలా? ఒళ్లంతా కళ్లు చేసుకుని అప్రమత్తంగా ఉండాలి. రూట్ చెకింగ్‌లో ఉన్నారు. సీఎం చంద్రబాబు ఉండవల్లికి బయలుదేరే సమయమైంది. అదే సమయంలో ఫోన్ రింగ్ కావడంతో చుట్టూ పరిసరాలు పరికిస్తూనే సీఐ శ్రీరాములు కాల్ పికప్ చేశారు.
మరో సీఐ విజయ్ కుమార్ చెప్పిన సమాచారం వినగానే శ్రీరాములు మరింత అప్రమత్తమయ్యారు. వెంటనే తిరుమల టూ టౌన్ సిబ్బందికి సమాచారం అందించారు. నిత్యం బిజీగా ఉంటే ఇక్కడి పోలీసులు కూడా తమ రెగ్యులర్ విధులు సాగిస్తూనే, పోలీస్ సాంకేతిక సిబ్బందిని అప్రమత్తం చేశారు. క్షణాల వ్యవధిలోనే ఆ మహిళ లొకేషన్ తెలిసిపోయింది. వెంటనే గాలింపునకు రంగంలోకి దిగారు.
కాలింగ్ ఫ్రం కంట్రోల్ రూం తిరుమల సీఐ ప్లీజ్ రెస్పాండ్ సర్
ఎస్.. దిసీజ్ తిరుమల వన్ టౌన్ సీఐ రెస్పాండింగ్. విషయం చెప్పండయ్యా.
కాలింగ్ ఫ్రం కంట్రోల్ రూం..
సర్..
"తిరుమల కాలిబాటలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోబోతున్నారంట. బెంగళూరు నుంచి వాట్సప్‌కు మెసేజ్, వీడియో అందింది" ఓవర్ సర్.
ఓకే.. ఓకే. విషయం అర్థమైంది. రోజర్.
వెంటనే తిరుమల వన్ టౌన్ సీఐ విజయ్ కుమార్ నారావారిపల్లెలో సీఎం బందోబస్తులో ఉన్న ఏ. శ్రీరాములుకు కాల్ చేశారు.
నమస్తే సార్, చెప్పండి. శ్రీను.. తిరుమలలో ఎవరో మహిళ ఆత్మహత్య చేసుకోబోతున్నారని కంట్రోల్ రూం నుంచి మెసేజ్ వచ్చింది. వీడియో కూడా పంపించారు. ఆమె సెల్ నంబర్ కూడా ఇదే. అని నంబర్ ఫార్వర్ఢ్ చేశారు.
ఓ పక్క వీవీఐపీ (సీఎంచంద్రబాబు) బయలుదేరే సమయం. అదే సమయంలో అత్యవసరంగా అందిన సందేశం. పోలీస్ విధుల్లో ఒత్తిడి సాధారణమే. తాను ఉన్న విధులు నిర్వహిస్తూనే, తిరుమల టూ టౌన్ సీఐ శ్రీరాములు తన స్టేషన్ సిబ్బందికి ఫోన్ చేసి, వివరాలు అందించారు. ఆ మహిళ సెల్ నంబర్ నడిచివస్తున్న వీడియో ఫార్వర్డ్ చేశారు.
ఓకే సర్ ఇప్పుడే చెక్ చేస్తాం. అని సిబ్బంది నుంచి సమాధానం. లైన్ కట్ అయింది. ఓ పక్క సీఎం చంద్రబాబు కాన్వాయ్ బయలుదేరింది. రూట్ క్లియర్ చేసున్న సీఐ శ్రీరాములు పరిసరాలను సునిశితంగా గమనిస్తూనే, వీవీఐపీ వాహనశ్రేణి తన పరిధి నుంచి దాటే వరకు కనురెప్ప కూడా వాల్చకుండా అప్రమత్తంగా ఉన్నారు. మధ్యాహ్నానికి రూట్ క్లియర్ అయింది.

ఈ లోపు తిరుమల టౌన్ పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగారు. తమ సీఐ శ్రీరాములు పంపించిన సెల్ నంబర్. పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సాంకేతిక సిబ్బందికి చెప్పారు. లోకేషన్ దొరికింది. వీడియోను పరిశీలిస్తే, తిరుమలకు ఉన్న రెండు కాలిబాటల్లో అలిపిరి, శ్రీవారి మెట్టు ప్రాంతమా? ఏదనే విషయంలో కాస్త సందిగ్ధత.

ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబీకులకు ఓ మహిళ పంపిన వీడియోలో అటవీప్రాంతం కావడంతో టూ టౌన్ పోలీసులు అలిపిరి మార్గంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. ఎక్కడా ఆ మహిళ జాడ కనిపించలేదు. అయినా పట్టువదలకుండా, శ్రీవారి మెట్టు నుంచి వచ్చే కాలిబాటలోని వీడియోలు కూడా చూస్తున్నారు. ఆ మార్గంలో కూడా తమకు అందిన వీడియోలోని మహిళ ఆచూకీ కనిపించలేదు. అదే సమయంలో ఈ రెండు మార్గాల్లోని టీటీడీ విజిలెన్స్ చెక్ పోెస్టులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఈ లోపు పోలీస్ సాంకేతిక విభాగం నుంచి సందేశం...
తిరుమల టూ టౌన్ రెస్పాండ్ ఫ్లీజ్..
సర్, నమస్తే, టూటౌన్ సెంట్రీ రెస్పాండింగ్ సర్
మీరు పంపిన సెల్ ఫోన్ నంబర్ శ్రీవారి మెట్టు ప్రాంతంలో లొకేట్ అయింది.
ఓకే సర్, మన రెస్క్యూటీంకు విషయం చెబుతాం. ఓవర్.
వెంటనే పోలీస్ రెస్క్యూ బృందాలు శ్రీవారిమెట్టు మార్గంలో పుటేజీ పరిశీలిస్తుంటే....
తాము గాలిస్తున్న మహిళ తిరుమలకు చేరుకుని, టీబీసీ ( ఏరియాలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లే సరికి ఆ మహిళ మళ్లీ తప్పిపోయింది. సీసీ టీవీ కంట్రోల్ రూంతో అనుసంధానంలోకి వెళ్లిన పోలీసులు ఎట్టకేలకు గెస్ట్ హూజ్ (Travelers Bangalow Cottage) ఏరియాలో అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ కు రానంటూ మహిళ మారాం చేశారు. "నాకు ఏమి కాలేదు. నేను స్వామి దర్శనానికి వచ్చా" అంటూ తప్పించుకోవడానికి చేసిన యత్నం పోలీసుల వద్ద సాగలేదు. ఆమెను బుజ్జగించి, నచ్చచెప్పి ప్రశాంతంగా స్టేషన్ కు తీసుకుని వచ్చారు. ఈ లోపు మధ్యాహ్నం అయింది.

మధ్యలో సిబ్బందితో టచ్ లోకి వచ్చిన సీఐ శ్రీరాములు సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అంతకంటే ముందే ఆ మహిళకు ఆహార పదార్థాలు ఏర్పాటు చేశారు. కాని ఆమె తీసుకోవడానికి ససేమిరా అన్నారు.
ఈ లోపు సీఎం చంద్రబాబు నారావారిపల్లె పర్యటన ముగించుకుని ఉండవల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. జిల్లా అధికారుల నుంచి అనుమతి తీసుకున్న సీఐ శ్రీరాములు తిరుమలకు చేరుకున్నారు. ఆందోళనగా ఉన్న మహిళతో మాట్లాడారు. అంతకుముందే తమకు కంట్రోల్ రూం నుంచి అందిన సెల్ ఫోన్ నంబర్ కు మాట్లాడి మహిళ తల్లిదండ్రులతో మాట్లాడారు. సాయంత్రానికి వారంతా తిరుమలకు చేరుకున్నారు.

"మమ్మల్ని కడుపుకోత నుంచి కాపాడారు. ఇద్దరు బిడ్డలకు తల్లి దూరం కాకుండా రక్షించారు" అని పోలీసులు కాళ్లు మొక్కడానికి యత్రించిన ఉద్విజ్న సంఘటన చోటుచేసుకుంది.
దీనిపై సీఐ శ్రీరాములు 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడారు.
మా ఎస్పీ ఎల్. సుబ్బారాయుకు కూడా సమాచారం అందింది. ఆయన సూచనల మేరకు
"ఆ మహిళను కాపాడడంలో తమ సిబ్బంది పాత్ర కీలకం. ఈ సమాచారం అందించడం ద్వారా మరో సీఐ విజయ్ కుమార్ తనకు దేవుడి సన్నిధిలో అవకాశం కల్పించారు" అన్నారు. "ఇది మా వృత్తి ధర్మంలో విధి నిర్వహించా" అని అన్నారు.
ఆయన కథనం ఇదీ..
తమిళనాడులోని శంకర్భా ర్య భావన (35) భర్తతో గొడవపడింది. కొడుకులు జస్వంత్ (13), రఘురాం (11)ను భర్త వద్ద వదిలి, హోసూరు నుంచి తిరుపతికి చేరుకుంది. తిరుమల శ్రీవారిమెట్టు నడకమార్గంలో వస్తూ బెంగళూరులో ఉన్న తన అన్న ప్రసాద్ కు ఫోన్ చేసింది.
"నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని What'app లో సెల్ఫీవీడియో పంపింది" చనిపోతే తన దేహమైనా అయిన వారికి దక్కాలి అనుకున్నదేమో. కానీ, ఆమె పంపించిన వీడియోెనే  ఆమె ప్రాణాలు కాపాడింది.
తీవ్ర ఆందోళనతో భావన అన్న ప్రసాద్ తిరుపతి పోలీసులకు వాట్సప్ కాల్ ద్వారా సమాచారం అందించడమే ఆలస్యం. క్షణాల్లో పోలీసులు కదిలారు. తిరుమల పోలీసులను అప్రమత్తం చేయడంతో పాటు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సహకారంతో శ్రీవారి మెట్టు మార్గంలో సీసీ కెమెరాల ఆధారంగా భావన ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, చేరదీసి ఓదార్చి, కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

గురువారం సాయంత్రానికి తిరుమల చేరుకున్న భావన అన్నయ్య ప్రసాద్, తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. తిరుమల సీఐలు శ్రీరాములు, విజయ్ కుమార్ కు చేతులెత్తి దండం పెట్టారు.
"మా చెల్లి భావనను, వెదికి పట్టుకుని, తమకు అప్పగించి ఒక కుటుంబాన్ని నిలబెట్టారు. పోలీసులు మానవత్వం చాటుకున్నారు. మీ రుణం తీర్చుకోలేమంటూ సీఐలు, పోలీస్ సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు.
ఆత్మహత్య పరిష్కారం కాదు..
ఆత్మహత్యాయత్నం అనేది మహాపాపం. సమస్యలు ఉంటే పోలీసుల సహాయం తీసుకోండి అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు వారికి హితవు పలికారు. సమస్యలు ఉంటే కుటుంబీలు లేదంటే నమ్మశక్యమైన స్నేహితులకు చెప్పడం ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మాత్రమే ప్రయత్నించాలి అని కూడా ఆయన సూచన చేశారు.
Tags:    

Similar News