తిరుమల: హిందూయేతరులకు డిక్లరేషన్ అమలు చేసిందెవరు? ఆ కథ ఏమిటి

తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఎందుకు? దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు? అసలు దీని వెనక ఉన్న కథ ఏమిటి?

Update: 2024-09-28 04:05 GMT

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లాలంటే అభ్యంతరాలు ఉండవు. హిందువులు కానీ వ్యక్తులు దర్శనానికి వస్తే మాత్రం డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది హిందువులు ప్రవేశపెట్టిన విధానం కాదు. భారతదేశాన్ని ఆక్రమించడానికి వచ్చిన బ్రిటీషర్లే దీనిని అమలు చేశారు. అంతేకాదు తిరుమల ఆలయ వ్యవహారాలను సవ్యంగా నిర్వహించడానికి శ్రద్ధ తీసుకున్నారు. శ్రీవారిస్వామివారికి క్రమం తప్పకుండా ఉదయాత్పూర సేవల నిర్వహణకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. తాజాగా..


డిక్టరేషన్ వ్యవహారాన్ని కొందరు మాత్రమే తెరపైకి తీసుకువచ్చి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఔన్నత్యాన్ని బయటికి ఈడుస్తున్నారు. దీంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

విషయానికివ వస్తే..
తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు వచ్చింది. దీనిని ఎప్పుడు ప్రవేశపెట్టారు. దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి. అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం.. తిరుమల ప్రపంచంలో రెండో అత్యంత ధనిక క్షేత్రం. నిత్యం యాత్రికులతో రద్దగా ఉంటుంది. ఈ క్షేత్రం ఎప్పుడో మొదటి స్థానానికి వచ్చేసింది.
సుమాలు 200 ఏళ్ల కిందట ఆర్కాట్ నవాబులు దేశంపై దండయాత్ర చేస్తూ. సంపద దోచుకునే వారు. మహమ్మద్ ఖాన్ వాలాజా సారధ్యంలోని సైన్యంతో తిరుపతిని తన గుప్పెట్లో ఉంచుకున్నారట. అతడు ఆర్థికంగా సతమతం అవుతున్న సమయంలో అతడి కన్ను తిరుపతి దేవస్థానం పైన పడింది. మహమ్మద్ అలీ ఖాన్ దేవాలయం ఆస్తి దోచుకుంటున్న సమయంలో..

ఇదో చారిత్రక కథ..

ఆ సమయంలో బ్రిటీష్ వారు ఈస్టిండియా కంపెనీ పేరిట దేశం మొత్తంలో విస్తరిస్తున్న సమయం అది. తిరుపతి ప్రాంతాన్ని కూడా కొందరు బ్రిటిష్ వాళ్ళు శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో జరిగిన చిన్న ఘర్షణలో ఈ విలియం అనే బ్రిటీష్ సైనికుడు తూటా గాయంతో బాధపడుతున్నాడు. ఆ ప్రాంతానికి వచ్చిన నుదుటిపై నామాలు ధరించిన ఒక పిల్లవాడు తిరుపతి కొండ వైపు నమస్కరించుకోమని చెప్పి వెళ్ళిపోయాడంట. తూటా గాయం తగిలిన సైనికుడు విలియమ్స్ ఏదో తెలియని మార్పు వచ్చినట్లు గమనించాడు. కొద్ది రోజులకు ఆయన కోలుకున్నారు. ఇదే విషయాన్ని విలియమ్స్ తన పుస్తకంలో రాసుకున్నాడనేది చరిత్ర చెప్పే కథనం.

ఈ కొండపైన ఏదో ఒక శక్తి నన్ను కాపాడింది అని భావించి అక్కడున్న కల్నల్ జియో స్టాలిన్ సర్ థామస్ మాంట్రి, సైన్యంలో ఉన్న ప్రధాన ఆఫీసర్లు కూడా ఏదో ఒక దివ్య శక్తి ఈ ప్రాంతంలో దాగి ఉందని భావించారు. దీంతో తిరుపతి ప్రాంతంలోని బ్రిటిషర్లు తిరుపతి చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పుడు వారికి ఆ క్షేత్ర మొత్తాన్ని ఆర్కాట్ నవాబులు దోచుకుంటున్నారని తెలుసుకొని, తిరుపతి ప్రాంతం నుంచి వారిని తరిమికొట్టారు.
తరువాత ఏమి చేశారు..?
1. చిత్తూరు కమిషనర్ గా ఉన్న బ్రూస్ అనే వ్యక్తి 1821లో బ్రోస్ కోడ్ అనే విధానాలతో ఒక డిక్లరేషన్ తయారు చేశారని చెబుతారు.
2. ఆ డిక్టరేషన్లో 42 అంశాలను పొందుపరిచారు. దానిలోని అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే
3. తిరుపతి దేవస్థానానికి ఒక స్వయం ప్రతిపత్తి కల్పించడం.
4. ఇతర మతస్తులు ఎవరు వచ్చిన దీనిలో జోక్యం చేసుకోకూడదు.
5. ఆలయం పూర్తిగా హిందువుల ఆధీనంలో ఉండాలి
6. నిర్వహణ వ్యవహారాలలో కూడా ఇతరులు ఎవరూ జోక్యం చేసుకోకూడదు
7. హిందువులే దీనికి ప్రామాణికం అని ఆ కోడ్లో పొందుపరిచినట్లు చెబుతారు.
8. హిందువులు కానీ వ్యక్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలనేది ఆయన రూపొందించిన విధానం.
ఇదిలావుండగా..
స్వాతంత్య్రానికి పూర్వం 1932లో టీటీడీ ట్రస్టు బోర్డును ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసుకుంది. మొదట్లో మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ సారథ్యంలో పరిపాలన సాగేది.
ఆలయాల పర్యవేక్షణ


1932లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన టీటీడీలో 12 ఆలయాలను పర్యవేక్షిస్తుంది. తిరుమల ఆలయ నిర్వహణ మొదట మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ సారథ్యంలో జరిగింది. టీటీడీ పాలన కోసం రెండు ప్రత్యేక సలహా మండలం ఏర్పాటు చేశారు.
1. ఆలయ కార్యకపాలకు సంబంధించింది.
2. ఆలయ సంబంధిత భూముల పర్యవేక్షణ కోసం సలహా మండలి రైతులతో ఉండేది.
స్వాతంత్య్రం తర్వాత ..
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1969 సెక్షన్ 85 నుంచి 91 వరకు టీటీడీ కి సంబంధించిన నిబంధనలను అందులో పొందుపరిచింది. దాని ఆధారంగా టీటీడీ ధర్మకర్తల సంఖ్య ఐదు నుంచి 11కు పెంచారు. ప్రధాన కర్తవ్యం హిందూ ధర్మం ప్రచారం చేయడం ట్రస్ట్ బాధ్యతగా సూచించారు. ఈ చట్టాన్ని 1987లో సవరించారు. ఎందుకంటే ట్రస్ట్ బోర్డు సంఖ్య 11 నుంచి 15 మందికి పెంచారు. ఆ తర్వాత 2006లో చేసిన సవరణతో 29 మందికి పెంచారు. ఆ తర్వాత 1987లో ఒకసారి 2006లో మరోసారి ఈ చట్టాన్ని సవరించారు. 2006 చట్ట సవరణలో భాగంగా హిందూ ఇతరులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రవేశించే ముందు డిక్లరేషన్ చేయడం తప్పనిసరిగా పేర్కొన్నారు.

" వెంకటేశ్వరుని పై తమకు సంపూర్ణ విశ్వాసం ఉంది" అని లిఖితపూర్వకంగా రాసి సంతకం చేయాలి. ఏపీ రెవెన్యూ ఎండోమెంట్-1 లోని జీవో ఎంఎస్ నెంబర్ 311 (1990) ప్రకారం ఆదేశాలునట్లు టీటీడీ అధికారులు చెబుతారు. దీనిని టీటీడీ చట్టంలో కూడా రూల్ నెంబర్ వంటి 136 గా పొందుపరిచారు. హిందూయేతరులు తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ప్రవేశించే ముందు ఈ ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది.
టీడీపీ ఆవిర్భావంతో...
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మాజీ సీఎం ఎన్టీ రామారావు కాలంలోనే రాజభరణాల తోపాటు టీటీడీలో హుండీ ఆదాయం, లడ్డు పడిలో వచ్చే ఆదాయాన్ని పూజారులు వంశం పరంపర్యంగా పొందే హక్కు ఉండేది. దీనినే మిరాశీ వ్యవస్థ అని కూడా ప్రస్తావిస్తారు. దాను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది.

డిక్లరేషన్
హిందూ మతేతరులు శ్రీవారి దర్శనానికి వస్తే.. లిఖితపూర్వకంగా డిక్లరేషన్ ఇచ్చే విధానాన్ని అమలులోకి వచ్చింది. శ్రీవేంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని, హిందూ సంప్రదాయాలను గౌరవిస్తామంటూ ఆ డిక్లరేషన్ పై స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఏపీ రెవెన్యూ ఎండోమెంట్-1 లోని జీవో ఎంఎస్ నెంబర్ 311 (1990) ప్రకారం ఆదేశాలునట్లు టీటీడీ అధికారులు చెబుతారు. డిక్లరేషన్ పద్ధతిని ఆ చట్టంలో కూడా రూల్ నెంబర్ 136 కింద ప్రస్తావించారు. అప్పటినుంచి కూడా అనేకమంది డిక్లరేషన్ ఇచ్చిన ఇతర మతస్తులు స్వామివారి దర్శనానికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
ఎక్కడ ఇస్తారు...

తిరుమల ఆలయంలోకి వెళ్లడానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 వద్ద ఈ డిక్లరేషన్ సమర్పించాలి. అందుకు సంబంధించిన పత్రాలను టీటీడీ అందిస్తుంది. హిందూ మతానికి చెందని ఇతర మతస్తులు ప్రధానంగా వీఐపీలు ఇతర దేశాల వారు డిక్లరేషన్ ఇవ్వాలి. లేదంటే వారు బసచేసిన అతిథి గృహం వద్దకే వెళ్లి ఆలయ అధికారులు డిక్లరేషన్ తీసుకుంటారు. ఇది అమలవుతున్న తీరు నామ మాత్రమే.
ఇదీ తిరుమల ఆలయంలో హిందూయేతరులకు అమలు చేసే డిక్లరేషన్ విధానం. తరచూ చెలరేగుతున్న వివాదంతో ఈ అంశం తెరపైకి వస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారంపై రాజకీయ రగడ శాంతించింది.
Tags:    

Similar News