ఫ్రీ బస్సు స్వేచ్ఛ, గౌరవానికి ప్రతీక

ఉచిత బస్సు టిక్కెట్‌తో సెల్పీలు దిగి ఈ ప్రపంచానికి సాధికారత అంటే ఎలా ఉంటుందో చూపించాలని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు.;

Update: 2025-08-16 12:53 GMT

ఉచిత బస్సు టికెట్‌ అనేది నమ్మకానికి.. నిదర్శనమని, స్వేచ్ఛకు, గౌవరానికి ప్రతీక అని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ఉచిత బస్సు టికెట్‌ అనేది స్వేచ్ఛ, గౌరవాలకు ఓ ప్రతీక అంటూ పేర్కొన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని మహిళల కోసం కూటమి ప్రభుత్వం ఫ్రీబస్సును ప్రారంభించడం చాలా గర్వంగా ఉందని సోషల్‌ మీడియా వేదికగా లోకేష్‌ పేర్కొన్నారు.

లోకేష్‌ ఏమన్నారటే..
ఉచిత బస్సు టికెట్‌ అనేది నమ్మకానికి నిదర్శనమని..స్వేచ్చకు, గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇది కేవలం ప్రయాణం కాదు.. అంత కంటే ఎక్కువ. ఇది చలనశీలత, స్వేచ్ఛాయుత, సమాన అవకాశం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్త్రీ శక్తి, ఉచిత బస్సు ప్రయాణ పథకంతో మహిళలకు సాధికారత కల్పించడం పట్ల గర్వంగా ఉంది. సోదరీమణులారా, ఈ ప్రయాణాన్ని అందరం కలిసి ఓ వేడుకగా జరుపుకుందాం! మీ టికెట్‌ను ఫ్రీబస్‌ టిక్కెట్‌ సెల్ఫీలతో పంచుకోండి.. సాధికారత ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించండి.. అంటూ మంత్రి ట్వీట్‌ చేశారు.


Tags:    

Similar News