టీడీపీలోకి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు

సీఎం చంద్రబాబు సమక్షంలో పచ్చ కండువా కప్పుకున్నారు.

Update: 2025-09-19 15:36 GMT

వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీలు ఆ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి షాక్‌ ఇచ్చారు. వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, కర్రి పద్మ, మర్రి రాజశేఖర్‌లు తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకున్నారు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఈ ముగ్గరు ఎమ్మెల్సీలు ఇది వరకే ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఆ మేరకు వారు తమ రాజీనామాలను మండలి ఛైర్మన్‌ మోషేను రాజుకు సమర్పించారు. అయితే వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెటారు. నేటికీ వాటిని ఆమోదించడం కానీ, వాటిపైన నిర్మణం తీసుకోవడం కానీ ఇంత వరకు చేయలేదు. కర్రి పద్మశ్రీ నామినేటెడ్‌ ఎమ్మెల్సీ కాగా, బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీలయ్యారు.

Tags:    

Similar News