సిలిండర్ పేలి చెల్లాచెదురైన ముగ్గురి శవాలు
విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.;
By : The Federal
Update: 2025-08-07 14:07 GMT
విశాఖటప్నం సముద్రతీరానికి అనుకుని ఉన్న ఫిషింగ్ హార్బర్ ప్రాంతానికి సమీపంలో ఓ దుకాణంలోని గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయి స్పాట్‌లో మరణించారు. మరో ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం.
అయితే ఒక్కసారిగా భారీగా పేలుడు సంభవించడంతో అది జరిగిన ప్రదేశం కంపించిపోయింది. సమీపంలోని షాపులు కూడా షేక్ అయ్యాయి. చుట్టుపక్కల ప్రజలు ఆందోళనలకు గురయ్యారు. సిలిండర్ భారీ పేలుడుకు ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు చెల్లాచెదురై పోయాయి. వ్యక్తులను గుర్తుపట్టలేని విధంగా చిద్రం అయిపోయాయి. మృతుల శరీర భాగాలు చెల్లాచెదురైపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ టీమ్‌తో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే చెత్తతో స్క్రాప్ వ్యాపారం చేసే షాపులో వెల్డింగ్ చేసే సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు.