తిరుమల పరాకామణి చోరీ కేసు.. నోెరు విప్పిన నిందితుడు

రవికుమార్ వీడియో సందేశంలో తెరవెనుక కథమేమిటి

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-12-06 16:38 GMT

తిరుమల పరకామణిలో చోరీ జరిగిన వ్యవహారం సంచలనం రేకెత్తించింది. ఈ వ్యవహారంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీవి. రవికుమార్ శనివారం రెండేళ్ల నోరు విప్పారు. జీయర్ గుమాస్తాగా పనిచేసిన రవికుమార్ ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి


"నేను తప్పు చేశాను. పరిహారం చెల్లించాను. జీయర్ మఠంలో గుమాస్తాగానే కాకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంపాదించిన సొమ్ములో 90 శాతంటీటీడీకి సమర్పించా" అని పరకామణి చోరీలో నిందితుడు రవికుమార్ స్పష్టం చేశారు. 

Full View

ఆయన వీడియో సందేశం వెనుక  అంతరార్థం ఏమిటనేది కూడా చర్చకు దారితీసింది. 



"ఈ కేసు చాలా చిన్నది" అని మాజీ సీఎం వైఎస్. జగన్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించడం. ఆ తరువాత టీటీడీ మాజీ చైర్మన్, వైఎసీపీ తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కొన్ని ప్రశ్నలు లేవనెత్తిన 24 గంటలు కూడా తిరగముందే పరకామణి చోరీ నిందితుడు రవికుమార్ ప్రాధాన్యత సంతరించుకుంది. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.
"వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ. సుబ్బారెడ్డి , టీటీడీ మాజీ చైర్మన్ గా ఉన్న కాలంలో నేను ఎక్స్ అఫీషియా సభ్యుడిని మాత్రమే. మమ్మలిని విచారణ చేశారు. వైసీపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్నవారిలో ప్రస్తుతం బీఆర్ నాయుడు సారధ్యంలోని బోర్డులో కూడా ఉన్నారు. వారిని ఎందుకు విచారణకు పిలవలేదు" అని భూమన కరుణాకరరెడ్డి సూటిగా నిలదీశారు. ఇది జరిగి 24 గంటలు కూడా గడవకనే తిరుమల పరకామణి చోరీ కేసులో నిందితుడిగా ఉన్న జీయర్ మఠం గుమస్తా పీవి. రవికుమార్ శనివారం ఓ వీడియో విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టుచీర బ్యాక్ గ్రౌండ్ లో ఉండగా రవికుమార్ మాట్లాడుతున్న వీడియో విడుదల చేయడం ఆసక్తి కరంగా మారింది. ఆయన ఎక్కడ ఉన్నారనేది కూడా చెప్పకుండా, నేను తప్పు చేశాను. జీయర్ మఠం గుమాస్తాగానే కాకుండా, కరెంటు పని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంపాదించిన సొమ్ములో 90 శాతం టీటీడీకి విరాళం అందించాను అని చెప్పడంతో పాటు తనను కొందరు బ్లాక్ మెయిల్ చేశారని కూడా రవికుమార్ ఆరోపించారు.
Tags:    

Similar News