అప్పిచ్చి ఆత్మహత్య చేసుకున్నారు

50వేలు తిరిగి చెల్లించాలని శ్రీనివాసరావు భార్య, కొడుకు వెంకటేశ్వర్లుపై ఒత్తిడి తెచ్చారు.;

Update: 2025-09-17 10:55 GMT

తాము ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించమన్నందుకు.. తాను అప్పును తిరిగి చెల్లించలేనని పురుగు మందు తాగాడు ఓ వ్యక్తి. దీంతో అప్పు ఇచ్చిన కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడి గురైంది. అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా పురుగు మందు తాగాడు. అతని భార్య, కొడుకు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. పురుగు మందు తాగిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఆసుçపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. ఈ దారుణమైన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదంలో చోటు చేసుకుంది.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదంకు చెందిన శ్రీనివాసరావు అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఆరు నెలల క్రితం రూ. 50వేలు అప్పుగా ఇచ్చాడు. అయితే తన వద్ద తీసుకున్న రూ. 50వేల అప్పును తిరిగి చెల్లించాలని గత కొద్ది రోజులుగా దాసరి వెంకటేశ్వర్లును శ్రీనివాసరావు అడుగుతున్నాడు. అయితే అప్పును చెల్లించకుండా వెంకటేశ్వర్లు ముఖం చాటేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం నాడు శ్రీనివాసుల భార్య పూర్ణకుమారి, వారి కుమారుడు వెంకటేశ్‌లు అప్పు తీసుకున్న దాసరి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లారు. అప్పు చెల్లించాలని అతనిని నిలదీశారు.
అయితే తాను అప్పు చెల్లించలేనని చెబుతూ పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య పూర్ణకుమారి, కుమారుడు వెంకటేశ్‌ ఇంటికొచ్చి జరిగిన విషయాన్ని భర్త శ్రీనివాసరావుకు చెప్పారు. దీంతో వెంకటేశ్వర్లు ప్రాణాలకు ప్రమాదం ఉంటుందేమో అన్న భయాందోళనలతో శ్రీనివాసరావు కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. పురుగుల మందు తాగిన వెంకటేశ్వర్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు తీసుకుంటున్నాడని తెలుసుకున్న శ్రీనివాసరావు భయంతో తాను కూడా పురుగు మందు తాగి ఆత్మహత్నాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఒక్క సారిగా షాక్‌కు గురైన అతని భార్య పూర్ణకుమారి, కుమారుడు వెంకటేశ్‌లు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో అప్పిచ్చిన శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం నెలకొంది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన దాసరి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావులు ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Tags:    

Similar News