వైసీపీ భూతం రాదనే గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు!

కాకినాడ జిల్లా పెద్దాపురం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-08-23 14:37 GMT
పెద్దాపురం సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

చంద్రబాబునాయుడు శనివారం కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సభలో వైసీపీ పాలన తీరుతెన్నులు, తన పాలనలో సూపర్‌ సిక్స్‌ గురించి మాట్లాడారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు చేపడితే ఆ వ్యవస్థ మనుగడ సాధించలేదన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఇంకా ఆయనేమన్నారంటే..?


సభకు హాజరైన ప్రజలు 

‘నేను ఎక్కడికెళ్లినా బాగానే పని చేస్తున్నానని, ఎన్డీయే పాలనా బాగుందని అంటున్నారు. కానీ మీ రాష్ట్రంలో భూతం (వైసీపీ/జగన్‌) ఉంది. ఆ భూతం మళ్లీ అధికారంలోకి రాదని గ్యారంటీ ఏమిటని అడుగుతున్నారు. అయితే ఆ భూతాన్ని పాతాళంలోకి కంట్రోల్‌ చేశాం. తిరిగి రాదని వారికి చెబుతున్నాం. సింగపూర్‌లో మన రాష్ట్రమంటే భయపడే పరిస్థితి ఉంది. మళ్లీ మేమే వస్తాం అని, పెట్టుబడులు పెట్టొద్దని వైసీపీ వాళ్లు బెదిరిస్తున్నారు. అరుంధతి సినిమాలో మాదిరిగా ఆ భూతం వదల బొమ్మాళి.. నిన్నొదల బొమ్మాళి అన్నట్టుగా పైకి వస్తోంది. అమరావతి మునిగి పోయిందని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ అమరావతి మునగలేదు.. మునిగింది, భవిష్యత్తులో భూస్థాపితం కాబోయేది మీ పార్టీ.యే. అమరావతికి నిధులు రాకుండా అడ్డుపడ్డారు. అమరావతిని ప్రపంచ మేటి నగరంగా నిర్మిస్తా. హైదరాబాద్‌ను నేనే కట్టాను. నేనే అభివృద్ధి చేశాను. విశాఖ, తిరుపతి, అమరావతి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా. మాకు సంపద సృష్టించడం, ఆదాయం పెంచడం తెలుసు. ఆదాయం పెంచి సంక్షేమం, అభివృద్ధి సమతుల్యంతో ముందుకు తీసుకెళ్తాం. ఎప్పడూ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. అప్పులు చేసి సంక్షేమ పథకాలు చేపడితే దోపిడి విధానాలు చేస్తే ఆ వ్యవస్థ మనుగడ సాధించలేదు. ఏ వ్యక్తయితే సంపద సృష్టిస్తాడో ఆ వ్యక్తి సంక్షేమ పథకాలు అమలు చేస్తాడు. గత పాలనలో రాష్ట్రంలో విధ్వంసం చేశారు. కుక్కల చింపిన విస్తరి చేశారు. అతలాకుతలం చేసి అరాచకాలను సృష్టించారు. మాట్లాడితే కొట్టడం, పోలీసులు కేసులు పెట్టడం వంటివి చేశారు. మేం వచ్చాక మీ జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పాం. ఆ విధంగానే ముందుకెళ్తున్నాం. 
సూపర్‌ సిక్స్‌ .. సూపర్‌ హిట్‌..
‘నేను సూపర్‌ సిక్స్‌ను ప్రకటిస్తే అది అమలు కాదని హేళనగా మాట్లాడారు. కానీ ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అయింది. సూపర్‌ సిక్స్‌తో కొన్ని ఇబ్బందులున్నాయి. అయినా అమలు చేస్తున్నాను. స్త్రీ శక్తి పథకంలో మహిళలు ఫ్రీగా బస్సుల్లో చంద్రన్న, పవన్‌ల పేరు చెప్పి ఎక్కడికైనా వెళ్తున్నారు. మీ అమ్మగారింటికీ వెళ్లండి. కానీ బోరు కొడితే రోజూ వెళ్తే సమస్యలొస్తాయి. పుణ్యక్షేత్రాలకు వెళ్లి దేవుని దర్శనం చేసుకోండి. కోటి మంది ఆడబిడ్డలు ఇప్పటివరకు ఉచితంగా ప్రయాణించారు.’
85 లక్షల టన్నుల చెత్తను ఉంచేశారు. .
‘గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేశారు కానీ చెత్త తీయలేదు. మున్సిపాలిటీలను చెత్త చేసి పారేశారు. రాష్ట్రంలో 85 లక్షల టన్నుల చెత్తను టైన్లలో వేశారు. అక్టోబరు 2 నాటికి ఈ చెత్త, చెదారం అంతా క్లీన్‌ చేయాలని అధికారులను ఆదేశించాను. చెత్త నుంచి ఎలా సంపదను సృష్టించాలో ఆలోచిస్తున్నాం. మీ ఇంట్లో చెత్తను సేకరించడానికి ఒక వాహనాన్ని పంపుతాం. మీ వద్ద ఉన్న వ్యర్థాలకు ఒక రేటు నిర్ణయించి కొనుగోలు చేస్తారు. పెద్దాపురంలో 15 మెగావాట్ల సామరథ్యంతో రూ. 330 కోట్లతో వేస్ట్‌ ఎనరీ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నాం. ఈ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల చెత్తను తీసుకొచ్చి దాంతో విద్యుత్‌ తయారు.చేస్తారు. పొలంలో గడ్డి నుంచి అట్టపెట్టెలు, సముద్రంలో నాచు (సీ వీడ్‌) నుంచి బయో కెమికల్, ప్రొటీన్లు, మెడిసిన్‌ తాయారు చేయొచ్చు. దీనికి శ్రీకారం చుట్టాం. స్వర్ణాంధ్రప్రదేశ్‌లో అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం. పేదవాడి ఆరోగ్యం కోసం ఏం చేయాలో అది చేస్తాం. దోమల నిర్మూలనకు డ్రోన్లు ఉపయోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పీపీపీ విధానంలో ఆస్పత్రుల నిర్వహణ చేపట్టేలా ప్రజారోగ్యంపై కొత్త పాలసీని తీసుకొస్తున్నాం. అక్టోబర్‌ 2న 16 కేటగిరీల్లో స్వచ్ఛాంధ్ర అవార్డులిస్తున్నాం.
2027లో పోలవరం జాతికి అంకితం..
వైసీపీ పాలకు పోలవరం ప్రాజెక్టును నాశనం చేస్తే మేం వచ్చాక గాడిన పెట్టాం. 2027లో పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం. అమరావతినీ ప్రాజెక్టును నాశనం చేస్తే మళ్లీ ట్రాక్‌లో పెట్టాం. రాబోయే రోజుల్లో ప్రజలకు పన్నుల భారం తగ్గించే చర్యలు తీసుకంటాం. విదేశాల నుంచి నిధులు సాధిస్తున్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా 12 వేల కోట్లు మంజూరు చేయించాం.
ఏ రాజకీ పార్టీకైనా టీవీ ఉందా?
టీడీపీకి, పవన్‌కి, బీజేపీకి సొంత టీవీ గాని, పేపరు గాని ఉందా? కానీ జగన్‌కు ఉంది. పేపరు, టీవీలతో తప్పుడు వార్తలు ప్రసారం చేయడానికి పెట్టుకున్నాడు. వివేకానందరెడ్డిని హత్య చేసి గుండెపోటుతో చనిపోయారన్నారు. విశాఖలో కోడికత్తి డ్రామా నేనే పొడిపించానన్నారు. ఎన్నికల ముందు గులకరాయి డ్రామా ఆడి అమాయకుడిని చిత్రహింసలు పెట్టారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా రాని విష రాజకీయ పార్టీ వైసీపీ. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో నక్సలిజం ఉండేది. నేనే ఆనాడు వారిపై పోరాడాను. నా కోసం కాదు.. నామీద దాడిచేసినా భయపడలేదు. రాయలసీమలో ఫ్యాక్షనును, హైదరాబాద్‌లో మతవిధ్శేషాలను నిరోధించాను. దేశంలో నెంబరు 1కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ని చేస్తా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన సుదీర్ఘ ప్రసంగంలో వివరించారు. అనంతరం బంగారు కుటుంబాల కింద దత్తత తీసుకున్న వారిని వేదికపై పరిచయం చేశారు.
Tags:    

Similar News