పాకిస్తాన్ యుద్ధంలో భారత్ కు ఈ మూడు వ్యవస్ధలే శ్రీరామరక్ష
పాకిస్తాన్ తో గురువారం రాత్రి యుద్ధం మొదలైన దగ్గర నుండి మూడు ఆయుధ వ్యవస్ధల గురించి యావత్ దేశం అదేపనిగా గొప్పగా చెప్పుకుంటోంది;
పాకిస్తాన్ తో గురువారం రాత్రి యుద్ధం మొదలైన దగ్గర నుండి మూడు ఆయుధ వ్యవస్ధల గురించి యావత్ దేశం అదేపనిగా గొప్పగా చెప్పుకుంటోంది. ఇంతకీ ఆ ఆయుధాలు ఏవంటే విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, ఎస్ 400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, రఫేల్ ఫైటర్ జెట్లు. ఈ మూడు ఆయుధ వ్యవస్ధల వల్లే పాకిస్తాన్ కు భారీ నష్టాలు జరిగాయని చెప్పుకోవాలి. నాలుగురోజులు గనుక పాకిస్తాన్(Pakistan) మనదేశంతో యుద్ధం చేయగలిగితే చాలు పైన చెప్పుకున్న ఆయుధ వ్యవస్ధల సామర్ధ్యం యావత్ ప్రపంచానికి తెలిసొస్తుంది అనటంలో సందేహంలేదు. ఈ మూడు ఆయుధ వ్యవస్ధలు దాయాది దేశాన్ని దారుణంగా దెబ్బతీయటంలో ఒకదానికి ఇంకోటి ఎందులోను తీసిపోదు. అందుకనే పాకిస్తాన్ యుద్ధంలో(Ind-Pak War) చేతులెత్తేస్తే మొత్తం క్రెడిట్ ఈమూడు ఆయుధ వ్యవస్ధలకే వెళుతుందనటంలో ఎలాంటి సందేహంలేదు. ఇపుడు మూడు వ్యవస్ధలగురించి తెలుసుకుందాము.
సుదర్శన చక్ర: మొదటగా ఎస్ 400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్(s400 Missile Defense System) గురించి తెలుసుకుందాం. ఈ ఎస్ 400 ను మనం రష్యానుండి కొనుగోలు చేశాము. ఇది అత్యంత అధునాతన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. గరిష్టంగా 400 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కచ్చితంగా ఛేదిస్తాయనటంలో ఎలాంటి సందేహంలేదు. గురువారం రాత్రి మనదేశంలోని అనేక నగరాలపైకి పాక్ ప్రయోగించిన రాకెట్లు, ద్రోన్లు, మిసైళ్ళను ఎస్ 400 డిఫెన్స్ సిస్టమే గుర్తించి వాటిని గాలిలోనే పేల్చేసింది. ఈ ఎస్ 400 రష్యానుండి మనకు చేరిన తర్వాత నరేంద్రమోదీ((Narendra Modi) దీనికి సుదర్శన చక్ర(Sudarshan Chakra) అని పేరుపెట్టారు. అందుకనే దీన్ని అందరు ఇపుడు సుదర్శనచక్రమని కూడా పిలుస్తున్నారు.
ఆరు సుదర్శనచక్రలను మనదేశం రష్యా(Russia) నుండి కొనుగోలుచేసింది. ప్రస్తుతం మన దగ్గర నాలుగున్నాయి. మరో రెండింటిని రష్యా తొందరలోనే అందచేయబోతోంది. దీన్ని కొనుగోలు చేయకుండా అమెరికా(America) చాలా ప్రయత్నాలు చేసింది. రష్యానుండి ఎస్ 400 కొనుగోలుచేస్తే మనదేశంపై అనేక ఆంక్షలను విధిస్తామని కూడా అమెరికా బెదిరించింది. అయితే అగ్రరాజ్యం బెదిరింపులను మోదీ ఏమాత్రం లెక్కచేయకుండా సుమారు 45 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఆరు సుదర్శనచక్రాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. ఇపుడీ సుదర్శనచక్రాలే మనదేశానికి కాపాడుతున్నాయి. పాకిస్తాన్ ప్రయోగించిన మిసైళ్ళు, ద్రోన్లు, రాకెట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా మన భూభాగాన్ని తాకి పేలలేదంటేనే ఎస్ 400 ఎంత సమర్ధవంతంగా పనిచేస్తోందో అర్ధమైపోతోంది. పాక్ ప్రయోగించిన అన్నీ అస్త్రాలను సుదర్శనచక్ర గాలిలోనే అడ్డుకుని గాలిలోనే పేల్చేస్తోంది. మనదగ్గరున్న నాలుగు సుదర్శనచక్రాల్లో మూడింటిని కేంద్రప్రభుత్వం మూడుచోట్ల మోహరించింది. జమ్మూ-కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు రక్షణగా పఠాన్ కోట్ లో ఒకటి, రాజస్ధాన్-గుజరాత్ రాక్షణకోసం రెండోది, మూడో చక్రాన్ని చైనా సరిహద్దులున్న ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించింది. నాలుగోదాన్ని స్పేర్ గా ఉంచుకున్నది కేంద్రం.
ఐఎన్ఎస్ విక్రాంత్ : విక్రాంత్(INS Vikrant) అంటే సంస్కృతంలో విజేత అనర్ధం. తనను ఎవరైనా సవాలు చేస్తే వాళ్ళమీద పోరాడి విజయం సాధిస్తాను అని సంస్కృతంలో అర్ధం. దీన్ని మనదేశమే సొంతంగా తయారుచేసుకుంది. ఇది మామూలు వార్ షిప్ కాదు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇండియన్ నేవీ ‘వార్ షిప్ డిజైన్ బ్యూరో’ రూపొందించిన డిజైన్ ప్రకారం కొచ్చిన్ షిప్ యార్డ్ లో తయారైంది. ఇది ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్(ఐఏసీ)గా ఎంతో పాపులరైంది. అత్యాధునిక రాడార్ వ్యవస్ధను రష్యా సహకారంతో సమకూర్చుకున్నాము. 1945, సెప్టెంబర్ 22 లోనే తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ కాలక్రమంలో అనేక మార్పులతో ఆధునిక సాంకేతిక వ్యవస్ధలను సంతరించుకున్నది. 262 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తు, 150 మీటర్ల వెడల్పుంటుంది. ఇందులో ఒకేసారి 30 మిగ్ 29కె యుద్ధ విమానాలను మోసుకెళ్ళగలదు. అలాగే 15 వార్ హెలికాప్టర్లు దీనిమీద నుండి ఆకాశంలోకి లేవగలవు. దీని బరువు 45 వేల మెట్రిక్ టన్నులు. గురువారం రాత్రి కరాచిలోని నౌకాశ్రయం మీద మన సైనికులు బాంబులు కురిపించి ధ్వంసంచేశారంటే విక్రాంతే కారణం. 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా దీనిపైనుండి ఛేదించవచ్చు. గగనతలంలో నిఘాకోసం ఉపయోగించే కెమోవ్-31 హెలికాప్టర్లు, యాంటీ సబ్ మెరైన్ మిషన్లకోసం ఉపయోగించే హాల్ ధ్రువ్ హెలికాప్టర్లు విక్రాంత్ నుండే శతృలక్ష్యాలపైకి దూసుకుపోతాయి.
విక్రాంత్ లో బరాక్ -8 క్షిపణలు, ఈఎల్/ఎం-2248 ఎంఎఫ్ స్టార్ వంటి అత్యాధునికి రాడార్లు ఇందులో 24 గంటలూ పనిచేస్తుంటాయి. శతృవులు ప్రయోగించే రాకెట్లు, మిసైళ్ళు, ద్రోన్లను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా విక్రాంత్ లో పనిచేస్తున్న రాడార్ల వ్యవస్ధ ఇట్టే పసిగట్టేస్తాయి. కరాచిలోని పోర్ట్ తీవ్రంగా దెబ్బతిన్నదంటే ఆ క్రెడిట్ ఐఎన్ఎస్ విక్రాంత్ కే దక్కుతుంది. విక్రాంత్ కు రక్షణకవచంగా కల్వరి క్లాస్ జలాంతర్గాలు, కోల్ కతా క్లాస్ డెస్ట్రాయర్లు, తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లు పనిచేస్తుంటాయి. ఇన్నిహంగులతో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ నీటిలో తేలియాడే అతిపెద్ద శతృదుర్భేద్యమైన కోటలాగ కనబడుతుంది.
రాఫెల్ ఫైటర్ జెట్లు : మూడో ఆయుధ వ్యవస్ధ రాఫెల్ ఫైటర్ జెట్లు(Rafale Fighter Jets) యుద్ధంలో అత్యంత కీలకంగా మారింది. నాలుగు రోజుల క్రితం మన ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) లో రాఫెల్ యుద్ధవిమానాలే అత్యంత కీలకపాత్ర పోషించాయి. వీటిని మనం ఫ్రాన్స్ నుండి కొనుగోలుచేశాము. 4.5 జనరేషన్ రకానికి చెందిన రఫేల్ ఆపరేషన్ సిందూర్ లో తొమ్మిది ఉగ్రవాద స్ధావరాలను నూరుశాతం కచ్చితత్వంతో ఛేందించగలిగాయంటేనే వీటి సామర్ధ్యం అర్ధమైపోతోంది. ఈమధ్యనే ఈ ఫైటర్ జెట్లు ఎయిర్ ఫోర్సులో చేరాయి. యుద్ధ నౌకలపైన నుండి ప్రయోగించగలిగిన రాఫెల్ జెట్లు తొందరలోనే రాబోతున్నాయి. రఫేల్ ఫైటర్ జెట్లు ఇండియాకు అందితే అత్యంత బలోపేతమవుతుందన్న ప్రచారమే ఇపుడు నిజమని నిరూపితమైంది. ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ భూభగంలోకి ప్రవేశించకుండానే 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను కూడా రాఫెల్ ఫైటర్ జెట్లు చాలా ఈజీగా ఛేదించాయి. తాజా యుద్ధంలో రాఫెల్ కరాచి, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ లాంటి అనేక నగరాలపైన దాడులు చేస్తు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. రాఫెల్ దెబ్బకు పాకిస్తాన్ చేతులెత్తేసినట్లే కనబడుతోంది. రాఫెల్ ను నియంత్రించలేక అలాగని ఎదురుదాడులు చేయలేక దాయాది దేశం నానా అవస్తలు పడుతోంది.
రాఫెల్ జెట్లలోని ప్రధాన ఆయుధాలు స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్, హామర్ మిసైల్స్. స్కాల్ప్ మిసైల్ 250 నుండి 560 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను నూరుశాతం కచ్చితత్వంతో ఛేదిస్తాయి. 450 కేజీల వార్ హెడ్లతో భూగర్బాల్లో నిర్మించిన బంకర్లను కూడా నాశనం చేసేస్తుంది. అలాగే హామర్ లేజర్ గైడెడ్ బాంబ్ రేంజ్ 20 నుండి 70 కిలోమీటర్లు. వెయ్యి కేజీల వార్ హెడ్ తో టార్గెట్ ను కచ్చితంగా ఛేదిస్తుంది. ప్రస్తుతం మనదగ్గర సింగిల్ ఇంజన్, డబుల్ ఇంజన్ కలిపి 36 రఫెల్ జెట్లున్నాయి. రు. 60 వేల కోట్లతో మరో 26 జెట్ల కొనుగోలుకు ఇండియా-ఫ్రాన్స్ మధ్య ఒప్పందం జరిగింది. ఇవన్నీ 2028-30 మధ్యలో మనదేశానికి అందుతాయి.