2026లో రిటైర్మెంట్‌ అయ్యే ఐపీఎస్‌లు వీరే

త్వరలో పదవీ విరమణ చేయనున్న ఐపీఎస్ ల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

Update: 2025-10-06 13:04 GMT

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్‌ అధికారలు త్వరలో పదవీ విరమణ పొందనున్నారు. దాదాపు ఎనిమిది మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఉద్యోగ విమరణ చేయనున్నారు. వచ్చే ఏడాది అంటే 2026లో రోజులు, నెలల తేడాలో వీరంతా రిటైర్మెంట్‌ కానున్నారు. 1990 బ్యాచ్‌ కు చెందిన అంజనీ కుమార్‌. 31.01.2026 సంవత్సరంలో పదవీ విరమణ పొందనున్నారు. 1991 బ్యాచ్‌ కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్‌ 30.06.2026 సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. 1992 బ్యాచ్‌ కు చెందిన పి. సీతారామాంజనేయులు 31.08.2026 సంవత్సరంలో పదవీ విరమణ పొందనున్నారు. 1992 బ్యాచ్‌ కు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి 30.04.2026న ఉద్యోగ విరమణ చేయనున్నారు.

1993 బ్యాచ్‌ కు చెందిన పీవీ సునీల్‌ కుమార్‌ 30.06.2026 సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. 1994 బ్యాచ్‌ కు చెందిన ఎన్‌. బాలసుబ్రమణ్యం 31.10.2026 సంవత్సరంలో రిటైర్మెంట్‌ కానున్నారు. 2005 బ్యాచ్‌ కు చెందిన జి. పాల్‌ రాజు 31.01.2026 సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. 2015 బ్యాచ్‌ కు చెందిన కె.ఎస్‌.ఎస్‌.వి. సుబ్బారెడ్డి 31.03.2026 సంవత్సరంలో పదవీ విరమణ పొందనున్నారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ సోమవారం నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News