టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు రీ పోలింగ్‌ కోరిన బూత్‌లు ఇవే

రీ పోలింగ్‌కు అధికార, ప్రతిపక్షాలు డిమాండ్‌. సీఈఓకి పోటా పోటీగా ఫిర్యాదులు

Update: 2024-05-15 07:42 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు చోట్ల రీ పోలింగ్‌ నిర్వహించాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకరు రిగింగ్‌కు పాల్పడ్డారని, ఫిర్యాదులు చేయగా, మరొకరు హింసకు పాల్పడ్డారని ఫిర్యాదులు చేశారు. హింసాత్మాక సంఘటనలు చోటు చేసుకోవడం, గాలులోకి కాల్పులు జరపడం, అభ్యర్థుల మీద దాడులు చేయడం, గృహనిర్భందాలకు పాల్పడటం, ఈవీఎంలు మొరాయించడం వంటి పలు సంఘటనలతో పోలింగ్‌కు అంతరాయం కలిగిందని, దీంతో ఆ ప్రాంతాల్లో తిరిగి రీ పోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఆ మేరకు టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు పోటా పోటీగా ఫిర్యాదు చేయడం గమనార్హం. మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌ కుమార్‌మీనాను కలిసిన టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు వినతులు అందజేశారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండూరి అఖిల్‌ తదితరులు ముకేష్‌ కుమార్‌ మీనాను కలువగా, మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ముకేష్‌ కుమార్‌ మీనాను కలిసారు.

టీడీపీ కోరినవి ఇవే
రాష్ట్ర వ్యాప్తంగా 31 చోట్ల రీ పోలింగ్‌ నిర్వహించాలని టీడీపీ నేతలు కోరారు. పల్నాడు జిల్లాలోనే ఎక్కువ పోలింగ్‌ స్టేషన్‌లు ఉండగా, ఒంగోలు, చిత్తూరులో కూడా ఉన్నాయి. మాచర్లలో 114, 115,116,117 పోలింగ్‌ బూతులతో పాటు సత్తెనపల్లిలో 234, 235,241, 242,243, 244 పోలింగ్‌ బూతులు, దర్శిలో 88, 93, 97, 155, 156 పోలింగ్‌ బూతులు, ఒంగోలులో 5, 6, 57, 194, 195 పోలింగ్‌ బూతులు, శ్రీకాళహస్తిలో 126, చిత్తూరులో 210, మదనపల్లిలో 221, అనంతపురం అర్బన్‌లో 143, 144, 145, 146, 147, 255, 256, పుట్టపర్తిలో 147, 203 తదితర పోలింగ్‌ బూతుల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కు టీడీపీ నేతలు విజ్జప్తి చేశారు.
సత్తెనపల్లిలో రీ పోలింగ్‌
వైఎస్‌ఆర్‌సీపీ కూడా రీ పోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజక వర్గంలో ఈ ఆరు చోట్ల టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని, దీంతో రీ పోలింగ్‌ నిర్వహించాలని కోరింది. సత్తెనపల్లి నియోజక వర్గంలో దమ్మాలపాడులో 253, 254 బూతులతో పాటు నార్నెపాడులో 236, 237 బూతులు, చీమలమర్రిలో 197, 198 బూతుల్లో టీడీపీ రిగ్గింగ్‌ చేసిందని, ఈ పోలింగ్‌ బూతుల్లో వెబ్‌ కెమేరాలను పరిశీలించి రీ పోలింగ్‌ నిర్వహించాలని కోరారు.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా జరిగాయని, ఎక్కడా కూడా రీ పోలింగ్‌ జరపాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మే 13 పోలింగ్‌ అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు రీ పోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ మంగళవారం సీఈఓకి ఫిర్యాదలు చేయడగం విశేషం. దీంతో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు కోరిన చోట్ల రీ పోలింగ్‌కు చర్యలు తీసుకుంటారా లేదా అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News