బడ్జెట్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావనే లేదు: మాజీ మంత్రి బుగ్గన

కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై వైఎస్‌ఆర్‌సీపీ విమర్శలు గుప్పించింది.

By :  Admin
Update: 2024-11-11 14:43 GMT

కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రస్తావనే లేదని వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వమర్శించారు. పథకాలకు కేటాయింపులు లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ను రూ. 41వేల కోట్లు పెంచిందని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సోమవారం తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తాజా కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ మీద ఆయన చురకలు అంటించారు. అమరావతికి రూ. 15వేల కోట్లు చూపించారన్నారు. అయితే ఆ నిధులు అప్పో, గ్రాంటో అనేది స్పష్టం చేయలేదన్నారు. మైనస్‌లో ఉన్న మీరు, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రూ. 24 వేల కోట్ల ఆదాయం ఎలా పెంచుతారని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ పథకం ఎంత మందికి ఇస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. అయినా దీని కోసం బడ్జెట్‌లో పొందుపరచిందన్నారు. అదీ కూడా కేవలం వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. అసలు ఈ పథకం అమలు చేయాలంటే రూ. 10వేల కోట్లు కావాల్సి ఉంటుందన్నారు. బడ్జెట్‌లో ఆడబిడ్డ నిధి ఊసే లేదన్నారు. సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులు పూర్తిగా తగ్గించారని విమర్శించారు.

Tags:    

Similar News