'ఒక్క ఆలోచన మీ భవిష్యత్ నే మార్చవచ్చు' అంటే ఇదే!
ఏమిటీ ఫ్యూచర్ ఫౌండర్స్ ప్రోగ్రాం, ఎందుకు పనికి వస్తుంది?
By : The Federal
Update: 2025-10-20 01:56 GMT
ఆవిష్కరణల దిశగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోంది. యువతకు కొత్త భవిష్యత్తును అందించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) ప్రారంభించిన “ఫ్యూచర్ ఫౌండర్స్ ప్రోగ్రాం”తో సృజనాత్మక ఆలోచనలకు దశాదిశ చేయనుంది. ఇది ఆరు వారాల పాటు కొనసాగే ప్రీ-ఇంక్యుబేషన్ కార్యక్రమం. సృజనాత్మక ఆలోచనలున్న యువత తమ కలలను సాకారం చేసుకునే దిశగా (ప్రోటోటైప్‌లు- ప్రారంభ నమూనాలుగా) రూపొందించుకోవడమే కాకుండా తొలి కస్టమర్లను చేరుకునే అవకాశం పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
RTIH రూపొందించిన ఈ ప్రోగ్రాం ద్వారా యువ ఆవిష్కర్తలు, ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పెట్టుకునే వారు ఎదుర్కొనే సాంకేతిక, మార్కెట్ సవాళ్లను దీటుగా ఎదుర్కోవచ్చు. పూర్తి స్థాయి ఇంక్యుబేషన్, మార్కెట్‌లో ప్రవేశానికి సిద్ధం కావొచ్చు. ఈ ప్రోగ్రాం ప్రధాన లక్ష్యం ఇదే. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో యువతీయువకులకు అవగాహన కల్పిస్తారు. విజయవాడతో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, అనంతపురం వంటి ప్రాంతాల్లో ఈ సెంటర్లు ఏర్పాటు అయ్యాి. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికీ ఇన్నోవేషన్ అవకాశాలు చేరేలా RTIH ఏర్పాట్లు చేసినట్టు ఆ సంస్థ సీఈవో ధాత్రిరెడ్డి చెప్పారు.
విజయవాడ సెంటర్ ప్రారంభం సందర్భంగా RTIH సీఈఓ ధాత్రి రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ దృష్టి కోణమే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వంటి సంస్థ ఏర్పాటుకు మార్గం సుగమం చేసిందన్నారు. రాష్ట్ర యువతకు మార్గదర్శకత్వం, వనరులు, మెంటర్‌షిప్ అందించడం తమ సంస్థ కర్తవ్యమని చెప్పారు.
rava.ai వ్యవస్థాపకుడు, సీఈఓ కిరణ్ బాబు రావా మాట్లాడుతూ “స్టార్టప్‌లకు సవాళ్లు ఉంటాయని, అయితే వాటిని ఎదుర్కొనే ధైర్యం, లక్ష్యం, దిశ ఉండాలన్నారు. కొత్తగా మార్కెట్ లోకి వచ్చే వారు తమ ఆలోచనలను నమ్మి ముందుకు సాగితే కచ్చితంగా సక్సెస్ సాధించవచ్చునని చెప్పారు. అవి సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురాగలవు అన్నారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 10 స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలను ప్రదర్శించాయి. ఈస్టార్టప్ లన్నీ యువతలోని సృజనాత్మకత, నిబద్ధత, నూతన ఆలోచనశక్తికి అద్దంగా నిలిచాయి.
RTIH సలహాదారు జి. కృష్ణన్ మాట్లాడుతూ “ నూతన ఆవిష్కరణలు చూస్తుంటే భవిష్యత్ బోలెడంత ఆశాజనకంగా కనిపిస్తోందన్నారు. సృజనాత్మక ఆలోచనలను స్థిరమైన వ్యాపారాలుగా మార్చే దిశగా ఇది పెద్ద మైలురాయి” అని పేర్కొన్నారు.
అసలేమిటీ ప్రోగ్రామ్...
‘ఫ్యూచర్ ఫౌండర్స్ ప్రోగ్రాం’ కేవలం స్టార్టప్‌ల సృష్టికే పరిమితం కాదు. ఇది నూతన ఆవిష్కర్తలలో నమ్మకం, స్పష్టత, సామర్థ్యం పెంచడంపైనే దృష్టి పెడుతుంది. మార్పు తీసుకురావాలనే తపనతో ముందుకు సాగే కొత్త తరానికి దిశానిర్దేశం చేసే వేదికగా నిలుస్తోంది.
ఆలోచన ఉంటే మార్పు సాధ్యమే అనే దాన్ని నిరూపిస్తుంది. ఆ మార్పును నమ్మి ముందుకు తీసుకెళ్లే వేదికగా నిలుస్తుంది ‘ఫ్యూచర్ ఫౌండర్స్ ప్రోగ్రాం’ ఆంధ్రప్రదేశ్ యువతకు కొత్త ఆశ, సరి కొత్త దిశ అని చెప్పవచ్చు.
ఇది 6 వారాల కోర్సు.. ఆసక్తి ఉన్న వాళ్లు ఈ నెంబర్లను సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్లు: +91 73967 52244, +91 73968 52244.
ఈ-మెయిల్: rtih-amvt@ap.gov.in
rtihamaravati@gmail.com
RTIH – విజయవాడ కార్యాలయం:
4వ అంతస్తు, సోనోవిజన్ భవనం,
ఎనికేపాడు, విజయవాడ
RTIH – విశాఖపట్నం కార్యాలయం:
5వ అంతస్తు, ది డెక్ బిల్డింగ్,
VMRDA ఎదురుగా, సిరిపురం, విశాఖపట్నం