మందులచీటీతో వీడిన మిస్టరీ మరణాల చిక్కుముడి

పాకాల వద్ద నలుగురు తమిళుల ఆత్మహత్యకు కారణం ఏమిటి?;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-16 08:33 GMT
పాకాల అటవీప్రాంతంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తిరుపతి జిల్లా పాకాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ మహిళ, పురుషుడి మృతదేహాలు కలకలం రేపాయి. మరో ఇద్దరిని సమాధి చేసినట్టు రాళ్లు పేర్చి ఉండడం పశువుల కాపరులు గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రిస్క్రిప్షన్  ఆధారంగా వారు తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. దీంతో  మరణాల మిస్టరీ వీడింది.

సంఘటన తీరు ఇది


చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల పరిధిలోని గాదంకి టోల్ ప్లాజా ( Gadanki Toal Plaza ) సమీప ప్రదేశాలు అడవిలో ఉంటాయి. చంద్రగిరి, పాకాల మండలాలకు సరిహద్దుల్లో పనపాకం వద్ద ఉన్న రక్షితమైన అడవిలో బాగా కుళ్లిన స్థితిలో ఒక పురుషుడి మృతదేహం చెట్టుకు వేసిన ఉరితాటికీ వేలాడుతూ కనపిచింది. కిందనే మరో మహిళ మృతదేహం కూడా పడి ఉంది. వీరికి సమీపంలోని ఇద్దరిని ఖననం చేసినట్లు చుట్టూ రాళ్లు పేర్చి ఉండడం అక్కడ దృశ్యం కనిపించింది.

ఎలా తెలిసింది
పనభాకం సమీప ప్రాంతంలోని కొందరు వ్యక్తులు ఆదివారం మేతకు పశువులను అడవిలోనికి తోలుకొని వెళ్లారు. అక్కడ ఇద్దరి మృతదేహాలను చూసిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన పాకాల సీఐ సుదర్శన్ ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు.
"అడవిలోని ఆ ఘటనా స్థలంలో ఓ వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతుంది. వస్త్రం కప్పి ఉన్న మరో మహిళ శవం కూడా పడి ఉంది. ఈ శవాలకు సమీపంలోనే రెండు గోతులు తీసి పూడ్చి పెట్టిన ఆనవాళ్లు" అక్కడ కనిపించాయి.
లభించిన ఆధారం..

ఓ పురుషుడు, మహిళ శవం పడి ఉన్న ప్రదేశంలో సీఐ సుదర్శన్ ప్రసాద్ ఆధారాల కోసం అన్వేషించారు. గొయ్యి తవ్వడానికి ఉపయోగించిన ఓ పార మృతదేహాలకు సమీపంలోని చెట్ల పొదల్లో దొరికింది. అక్కడే పగిలిన మద్యం సీసా తో పాటు కొన్ని దుస్తులు, మాత్రలు, కాగితాలు, సిమ్ కార్డు లేని సెల్ ఫోన్ కీప్యాడ్ లభించింది.
"ఆ ప్రదేశంలో తమిళనాడులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న డిస్క్రిప్షన్ దొరికింది. అందులో తమిళనాడులోని తంజావూరుకు చెందిన కలై సెల్వన్ పేరు నమోదు చేసి ఉంది" ఈ ఆధారంతోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుల వివరాలను తెలుసుకోగలిగారు. అయితే తంజావూరులో కూడా మిస్సింగ్ కేసులు నమోదు కాలేదనే విషయాన్ని అక్కడి పోలీసుల ద్వారా నిర్ధారణ చేసుకున్నారు. మృతదేహాలకు సమీపంలో దొరికిన మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా తంజావూరు పోలీసులతో పాకాల సీఐ సుదర్శన్ ప్రసాద్ కాంటాక్ట్ చేశారు. దీంతో పాకాల అడవుల్లో దొరికిన మృతదేహాల మిస్టరీ వీడినట్లు భావిస్తున్నారు.
ఎఫ్ ఎస్ ఎల్ సిబ్బందితో రంగ ప్రవేశం

పాకాల టోల్ ప్లాజాకు సమీపంలోని రక్షిత అటవీ ప్రాంతంలో మృతదేహాలు బయటపడిన ప్రదేశానికి పాకాల సీఐ సుదర్శన్ ప్రసాద్ ఎఫ్ ఎస్ ఎల్ (forensic science lab fsl) సిబ్బందితో చేరుకున్నారు. అక్కడ మరోసారి పరిశీలించడం ద్వారా శవాలకు పంచనామా నిర్వహించారు.
"కుళ్ళిన స్థితిలో శవాలుగా తేలిన వారిద్దరూ వరుసకు అన్నా చెల్లెలు" అవుతారని సి ఐ సుదర్శన ప్రసాద్ చెప్పారు. మృతుల సంబంధికులు కూడా తంజావూరు నుంచి ఘటనా స్థలానికి వచ్చినట్లు సమాచారం అందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వరుసకు అన్నా, చెల్లెలు అయిన వారిద్దరూ పిల్లలతో కలిసి వచ్చి, ఇక్కడ ఆత్మహత్యకు పాల్పడడానికి దారితీసిన పరిస్థితి ఏమిటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీానికి సంబంధించి పూర్తివివరాలు వెల్లడి కాలేదు.
Tags:    

Similar News