Manch Manoj | పోలీసులు ఏకపక్షంగా ఉన్నారు (వీడియో)

తన ఫామ్ హౌసులో నుండి తన మనుషులను బయటకు ఎలా పంపించారు?

Update: 2024-12-10 06:34 GMT

మంచుమనోజ్ పోలీసులపైన చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. కొద్దిసేపటి క్రితమే మనోజ్ జల్ పల్లి ఫామ్ హౌస్(Jalpalli Farm House) నుండి బయటకు వచ్చి నిముషంపాటు మాట్లాడాడు. మీడియాతో మాట్లాడిన మనోజ్(Manoj) పోలీసులపై ఆరోపణలు చేయటం గమనార్హం. తనకు రక్షణలేదని, రక్షణ కావాలని పోలీసులను అడిగినా పట్టించుకోలేదన్నారు. తనపైన జరిగిన దాడికి సంబందించిన సాక్ష్యాలను, తన వ్యతిరేకుల బౌన్సర్లను మాత్రం ఫామ్ హౌసులోనే ఉంచి తన మనుషులను మాత్రం బయటకు పంపేశారని మండిపడ్డారు. తన ఫామ్ హౌసులో నుండి తన మనుషులను బయటకు పంపేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అంటు నిలదీశారు. పోలీసులు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనమనుషులను బయటకు పంపిన పోలీసులు తన వ్యతిరేకుల మనుషులు, బౌన్సలర్లను మాత్రం ఫామ్ హౌసులోనే ఎందుకు ఉంచారని ప్రశ్నించాడు. ఈ విషయంలో తాను అందరినీ కలవబోతున్నట్లు చెప్పాడు. అందరినీ కలుస్తానని చెప్పిన మనోజ్ ఎవరిని కలవబోతున్నాడన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.

తన పోరాటం ఆస్తుల కోసం కాదని కేవలం ఆత్మగౌరవం కోసమే అన్నాడు. తన ఆత్మగౌరవానికి వచ్చిన నష్టం ఏమిటో మాత్రం చెప్పలేదు. తనతో డైరెక్టుగా ఫైట్ చేయకుండా తన భార్య, ఏడుమాసాల పాపను కూడా వివాదంలోకి లాగటమే తనను బాధించినట్లు మనోజ్ చెప్పాడు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మనోజ్ కు తండ్రి మోహన్ బాబు(Mohan Babu), అన్న విష్ణు(Vishnu)తో ఏమాత్రం పడటంలేదు. ఇపుడు పిర్యాదు చేసింది కూడా తండ్రి మీదే. మనోజ్ కు వ్యతిరేకంగా మోహన్ బాబు, పెద్ద కొడుకు విష్ణు ఏకమయ్యారు. కుటుంబంలో చాలాకాలంగా విభేదాలున్నాయి. ఇన్ని విభేదాలున్నా మోహన్ బాబు, మనోజ్ నాలుగు నెలల క్రితం వరకు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. మూడురోజులుగా గొడవలు పెరిగిపోయి, దాడులు చేసుకుని, ఫిర్యాదులు చేసుకుని కేసులు బుక్ అయిన తర్వాత కూడా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇది సరిపోదన్నట్లు దుబాయ్ నుండి మంగళవారం ఉదయమే హైదరాబాదు చేరుకున్న విష్ణు కూడా జల్ పల్లి ఫామ్ హౌసులోనే ఉన్నాడు.

ఇన్ని గొడవలు జరిగినా, ఫిర్యాదులు చేసుకుని కేసులు బుక్ అయి, పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినపుడు కూడా తండ్రి, ఇద్దరు సోదరులు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇదంతా చూసిన తర్వాత అసలు వీళ్ళ మధ్య గొడవలు వాస్తవమేనా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఒకళ్ళనుండి మరోకళ్ళకు ప్రాణహాని ఉందని పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న తర్వాత కూడా ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండటమే ఆశ్చర్యంగా ఉంది.

Tags:    

Similar News