వాయుగుండం తీరం దాటింది
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులు కురిసే అవకాశం ఉంది.;
బంగాళాఖాతంలో గత కొద్ది రోజుల క్రితం ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. పశ్చిమ వాయువ్యం దిశగా కదులుతూ తీరాన్ని దాటింది. ఈ వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథకుమార్ మాట్లాడుతూ ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు పేర్కొన్నారు.
శుక్రవారం, శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ఆంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సముద్ర తీరంలోని ఉత్తర కోస్తా పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అలాగే సముద్ర తీరం వెంబడి ఉన్న దక్షిణ కోస్తా పోర్టులకు ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.