బెయిలొచ్చినా..వెంటాడుతున్న భయం

పేర్ని జయసుధకు సోమవారం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మంగళవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు.;

By :  Admin
Update: 2025-01-01 09:31 GMT

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై గతంలో కేకలేసిన మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ కీలక నాయకుడు, పేర్ని నాని కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం వెంటాడుతోంది. కోర్టుకెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నా వదిలి పెట్టడం లేదు. పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పేరు మీదున్న గోడౌన్‌లో రేషన్‌ బియ్యం మాయమైన కేసులో విచారణకు హాజరు కావాలని మరో సారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా విచారణ కోసం ఆర్‌పేట పోలీసు స్టేషన్‌కు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి పేర్ని జయసుధకు ఇది వరకే కోర్డు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ మంజూరు చేస్తున్న సందర్భంలో పోలీసుల విచారణకు సహకరించాలని పేర్ని జయసుధను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పోలీసులు జయసుధకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికెళ్లిన పోలీసులు అక్కడ పేర్ని నాని కుటుంబం లేక పోవడంతో ఇంటి డోర్‌లకు నోటీసులు అంటించారు. ఇది వరకు ఒక సారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని జయసుధతో పాటు పేర్ని నాని, వారి కుమారుడు పేర్ని కిట్టూకి కూడా నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే విచారణకు హాజరు కాలేదు. దీంతో రెండో సారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణకు పేర్ని నాని కుటుంబం హాజరవుతుందా? లేదా? అనేది దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News