వరదలకు ఖర్చు చేసిన వివరాలివే..కొవ్వొత్తులకు, అగ్గిపెట్టెలకు ఎంతంటే

ఇటీవల భారీ వరదల నేపథ్యంలో తక్షణ సాయం కింద ఎన్‌టీఆర్‌ జిల్లాలో చేసిన ఖర్చుల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.

Update: 2024-10-09 12:01 GMT

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, విజయవాడ, ఎన్టీఆర్‌ జిల్లాలో సంభవించిన వరదలకు తక్షణ సాయంగా ప్రభుత్వం చేసిన ఖర్చుల వివరాలను ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ విడుదల చేసింది. మొత్తం రూ. 139.75 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రూ. 89 కోట్లు కాగా, చేసిన చెల్లింపులు రూ. 79 కోట్లు అని తెలిపింది. ఇంకా అందుబాటులో ఉన్న నిధులు రూ. 10 కోట్లుగా రెవెన్యూ శాఖ వెల్లడించింది. ఆ లెక్కల ప్రకారం.. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు - రూ.23 లక్షలు, తాగునీటి బాటిళ్లుకు - రూ. 11.22 కోట్లు, ఆహార ప్యాకెట్లుకు - రూ. 57.22 కోట్లు, గుడ్లు, పాల ప్యాకెట్లుకు - రూ. 11.08 కోట్లు, బాధితులకు డ్రై ఫుడ్‌కు - రూ. 3.74 కోట్లు గా తెలిపింది. 

సహాయ శిబిరాల నిర్వహణకు - రూ. 4.80 కోట్లు, మృతులకు పరిహారంకు - రూ. 1.95 కోట్లు, పండ్లు కోసం - రూ. 3.64 కోట్లు, సబ్సిడీ కూరగాయలు కోసం - రూ. 8.88 కోట్లు, రవాణా ఖర్చులు కోసం - రూ. 5.35 కోట్లు, మున్సిపాలిటీలకు - రూ. 20.56 కోట్లు, వైద్యం, ఆరోగ్యం కోసం - రూ. 4.55 కోట్లు, వసతుల ఏర్పాట్ల కోసం - రూ. 2.07 కోట్లు, మత్స్యకారులకు,పడవలకైన ఖర్చు- రూ. 89 లక్షలు, పోలీసు, శాఖ రవాణా ఖర్చులు - రూ. 2.60 కోట్లు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హమాలీలకు అయిన ఖర్చు- రూ. 32 లక్షలు, ఇతర జిల్లాల నుంచి తరలించిన సిబ్బందికి పెట్టిన ఖర్చు - రూ. 34 లక్షలుగా వెల్లడించింది.


Tags:    

Similar News