ICC Champions Trophy | దుబాయ్ లో తెలుగువారి సందడి.. విజయోత్సవ సంబరం
టీమిండియా-కివీస్ జట్ల మధ్య క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ రసవత్తరంగా సాగింది. టీమిండియా గెలవగానే దుబాయ్ స్టేడియం తెలుగువారి కేరింతలతో సందడిగా మారింది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-03-09 16:27 GMT
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ క్రీడ అభిమానులతో నిండిపోయింది. టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ICC champions trophy 2025 పోటీ రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా జట్టును ప్రోత్సహించే విధంగా దుబాయ్ లోని భారతీయులు ప్రధానంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వెళ్లిన కార్మికులతో స్టేడియం నిండిపోవడమే కాదు. వారి ఆనందాతిరేకాలతో మారుమోగుతోంది.
బాణాసంచా వెలుగుల్లో టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న క్రికెట్ అభిమానులు
సాధారణంగా గల్ఫ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( United Arab Emirates- UAE) దేశాల్లో శుక్రవారం మాత్రమే సెలవు రోజు.
టీమిండియా, కివీస్ జట్ల మధ్య ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కావడంతో ఆదివారం అయినా దుబాయ్ తో పాటు సమీప దేశాల్లోని తెలుగువారు భారీగా స్టేడియం కు చేరుకున్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ముందుగానే టికెట్ కూడా కొనుగోలు చేశామని షార్జాలో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కడప జిల్లా చిట్వేలి కె ఎస్ అగ్రహారం ప్రాంతానికి చెందిన సుబ్బారెడ్డి 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
"దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న టీమిండియా, కివీస్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోరాటం ఆశాంతం ఆస్వాదించాం" అని ఆయన చెప్పారు. దుబాయ్ స్టేడియం ఫోటోలను కూడా షేర్ చేసిన సుబ్బారెడ్డి అక్కడ పరిస్థితి వివరించారు.
"సాధారణంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఇండియన్లే కాదు. అరబుగడ్డపై ఉన్న ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. పాకిస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఈ ఛాంపియన్ ట్రోఫీ కావడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. భారత్ క్రీడాకారులు
క్రీడాకారులు పాల్గొని ఈ మ్యాచ్ చూడ్డానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు" అని సుబ్బారెడ్డి చెప్పారు.
" అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న క్రికెట్ అభిమానులతో స్టేడియం నిండింది" అని వివరించారు.
ఈ ప్రాంతంలో ఏ దేశం మీద అయినా సరే భారత జట్టు క్రికెట్ పోటీలో పాల్గొంటుందంటే అరబు దేశాల్లోని తెలుగువారు విధులకు డుమ్మా కొట్టి మరి వస్తారు అని చెబుతున్నారు. టీమిండియో ట్రోెఫీ దక్కించుకున్న తరువాత దుబాయ్ తో పాటు అరబ్బు గడ్డపై ఉన్న భారతీయుల సందడి ఆషామాషీగా ఉండదని అక్కడి తెలుగు వారు చెబుతున్నారు. సంబరాలు ప్రశాంతంగా నిర్వహించుకోవడం, పార్టీలు చేసుకోవడానికి అభ్యంతరాలు ఉండబోవని అక్కడి తెలుగువారు వివరించారు. బెట్టింగుల కంటే, టీమిండియా విజయాన్ని ఆంకాంక్షిస్తూ, ఛాంపియన్ ట్రోఫీ డ్రస్సులు కొనుగోలు చేసి ధరించడం గర్వంగా భావిస్తామని అక్కడ నివాసం ఉంటున్న జాన్సన్ చెప్పారు. క్రికెట్ సీజన్ వచ్చిందంటే, అది కూడా దుబాయ్ లో మ్యాచ్ జరుగుతుందంటే మాకు ఇక్కడ పెద్ద పండుగ, భారత్ లో ఉన్నట్లే భావిస్తాం అని మరో ఎన్ఆర్ఐ రామ్మోహన్ చెప్పారు.
"ఎన్ని పనులు ఉన్నా, మన దేశ జట్టు సాధించే విజయం కోసం ప్రతిక్షణం ఉత్కంఠగా మ్యాచ్ ఆస్వాదిస్తాం" అని రామ్మోహన్ వివరించారు. క్రికెట్ మ్యాచ్ చూస్తేనే వారంతా ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో తమ ఆనందాన్ని పంచుకున్నారు.