అందుకే హెరిటేజ్ పెట్టా
రాజకీయ పార్టీకి కూడా ఒక కంపెనీ పెట్టి, దాని ద్వారా రాజకీయాలకు ఖర్చు పెట్టాలని ప్లాన్ చేశా. కానీ అది వీలు కాలేదని చంద్రబాబు చెప్పారు.;
దావోస్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వ్యాపార సంస్థైన హెరిటేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ ఎందుకు పెట్టారో.. ఎందుకు పెట్టాల్సి వచ్చిందో సీక్రెట్స్‌ను వెల్లడించారు. ఎవరైనా.. ఏ ఫీల్డ్‌లో ఉన్నా.. వారు ఆ రంగంలో రాణించాలంటే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి. రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదిస్తే ఎప్పటికీ ఆ గౌరవం రాదు. తన ఫ్యామిలీ ఎప్పుడూ రాజకీయాలపైన ఆధారపడకూడదని ఆలోచించాను. దాని కోసం వ్యాపారాలు చేయాలని బిగినింగ్‌లోనే నిర్ణయించుకున్నాను. ఒకటి రెండు వ్యాపారాలు ప్రారంభించా. అయితే అవి ఫెయిల్ అయ్యాయి.
అవి ఫెయిలైనా.. ఫైనల్‌గా హెరిటేజ్ పెట్టాను. దీని వల్ల మా కుటుంబం గౌరవంగా బతుకుతున్నాం. దీనికి కారణం హెరిటేజ్ పెట్టాలనే నిర్ణయమే కారణమని హెరిటేజ్ ఏర్పాటు చేయడానికి గల సీక్రెట్‌ను వివరించారు. తాను రాజకీయాలు చేసే వాడిని. తన సతీమణి భువనేశ్వరీ హెరిటేజ్ కంపెంనీ బాగోగులు చూసుకునే వారు. రాజకీయాల్లోకి రాక ముందు లోకేష్ కూడా హెరిటేజ్ కంపెనీను చూసుకున్నారు. లోకేష్ రాజకీయాల్లోకి రావడంతో ఆ బాధ్యతలను లోకేష్ సతీమని బ్రాహ్మణి చూసుకుంటుందని చెప్పొకొచ్చారు. దీని వల్ల కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులేవు. హెరిటేజ్ ఏర్పాటు పెట్టడం వల్ల తమ కుటుంబానికి ఏ రకంగా కూడా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లేవని చెప్పొకొచ్చారు. ఇలా ప్రతి ఒక్కరు చేయాలి సూచించారు.