దట్ ఈజ్ నారా లోకేష్..కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ డ్రైవర్ కుటుంబం
విధి నిర్వహణలో స్టెప్పులు వేశారని ఆర్టీసీ డ్రైవర్ లోవరాజును సస్పెండ్ చేశారు. మంత్రి లోకేష్ ఆయనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి, ఆ కుటుంబాన్ని నిలబెట్టారు.
సరదా కోసం స్టెప్పులేసిన ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఇది గత అక్టోబర్‌లో చోటు చేసుకుంది. డ్రైవర్ లోవరాజు వేసిన డ్యాన్స్ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. అది కాస్తా మంత్రి నారా లోకేష్ వద్దకు చేరింది. దీనిపై స్పందించిన లోకేష్ ఆ బస్సు డ్రైవర్ లోవరాజుకు తిరిగి డ్రైవర్ ఉద్యోగం వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. డ్రైవర్ లోవరాజు కుటుంబాన్ని లోకేష్ నిలబెట్టారు. ఈ నేపథ్యంలో లోవరాజు కుటుంబం బుధవారం లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు ఉండవల్లిలోని మంత్రి లోకేష్ నివాసం వద్దకు వచ్చారు. విషయం తెలుసుకున్న లోకేష్ సిబ్బంది లోవరాజు కుటుంబాన్ని లోకేష్ వద్దకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో లోవరాజు కుటుంబం లోకేష్‌ను కలిసారు. సస్పెన్షన్ రద్దుచేయించి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపించి నందుకు కుటుంబంతో సహా లోకేష్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లోవరాజు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న లోకేష్ ఆయన కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.