భువనేశ్వరి జీవిత భాగస్వామిగా ఉన్నందుకు కృతజ్ఞుడిని

నువ్వే నా బలం అంటూ నారా లోకేష్‌ తన తల్లి భువనేశ్వరికి హ్యాబీ బర్త్‌డే విషెస్‌ చెప్పారు.;

Update: 2025-06-20 05:52 GMT

సీఎం చంద్రబాబు తన భార్య నారా భువనేశ్వరిని మరో సారి ఓ రేంజ్‌లో పొగత్తలతో ముంచెత్తారు. భువనేశ్వరినే తనకు బలమని, దాతృత్వంలో కానీ, సేవా గుణంలో కానీ, వ్యాపారంలో కానీ.. ఇలా అన్నింటిల్లో తానే తనకు స్పూర్తిని చంద్రబాబు పేర్కొన్నారు. భువనేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సీఎం చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. భువనేశ్వరి ప్రేమే తమ కుటుంబానికి బలమని, భువనేశ్వరి ప్రేమే తమ కుటుంబానికి పునాదని వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో ప్రతి ఒడిదొడుకులలో తన పక్కనే ఉంటూ ఎంతో బలాన్నిచ్చారంటూ సోషల్‌ మీడియా వేదికగా తన భార్య భువనేశ్వరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భువనేశ్వరి తన జీవితానికి వెలుగని, భువనేశ్వరి తన జీవిత భాగస్వామిగా ఉన్నందుకు కృతజ్ఞుడిని అంటూ తన భార్య భువనేశ్వరి పట్ల తనకున్న ప్రేమాను రాగాలను మరో సారి çసీఎం చంద్రబాబు చాటుకున్నారు. వ్యాపారంలో కానీ, దాతృత్వంలో కానీ..ప్రతి విషయంలో కూడా భువనేశ్వరి నాయకత్వం తమకు స్పూర్తి అంటూ ఎక్స్‌ వేదికగా సీఎం చంద్రబాబు భువనేశ్వరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

నువ్వే నా బలం, నువ్వే నా మర్గదర్శి, మన కుటుంబానికి హార్ట్‌ ఆఫ్‌ ద ఫ్యామిలీ నువ్వే అంటూ మంత్రి నారా లోకేష్‌ తన తల్లి నారా భువనేశ్వరి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.


Tags:    

Similar News