కుప్పంలో విమానాశ్రయం నిర్మాణానికి సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కుప్పం రైతులను కోరారు. భూములు ఇచ్చే రైతులకు ప్రోత్సాహక పరిహారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతుల త్యాగాల వల్ల ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడుతుందనే విషయాన్ని గమనించాలని కోరారు.
బుధవారం నాడు ఆయన కుప్పం నియోజకవర్గంలోపర్యటించారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదిక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలకు భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖంగా లేరు. అనెేక చోట్ల రైతులు భూములు ఇచ్చేది లేదని ప్రదర్శనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఒకకొత్త ప్రకటన చేశాడంటే ఎక్కడోె ఒక చోట భూములు పోతాయనే భయం మొదలయింది. ఈ నేపథ్యంలో ఆయన కుప్పంలో విమానాశ్రయం నిర్మించాలనుకుంటున్నారు. ఇక్కడ కూడా రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నది. ఈ విషయ గురించి గతంలో ‘ఫెడరల్ ఆంధప్రదేశ్’ గతంలో విశదంగా రాసింది.
అందువల్ల ముఖ్యమంత్రి నేడు రైతులకు బహిరంగంగా విజ్ఞప్తి చేస్తూ భూములు అందించే రైతులకు ప్రోత్సాహకాలు కూడా ఉంటాయని ప్రటించారు.
"అభివృద్ధి,సంక్షేమం నా రెండు కళ్ళు. పేదల అభివృద్ధి కోసం మాత్రమే నా తాపత్రయం. కుప్పం నియోజకవర్గాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చి కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేకుండా తీర్చిదిద్దాం,చ" అని ఆయన చెప్పారు. తొందరలో నియోజకవర్గ మొత్తంలో ప్రతి ఇంటా సోలార్ ప్యానల్ ఏర్పాటు చేయించి, గ్రీన్ ఎనర్జీ కుప్పం గా మారుస్తా అని ఆయన ప్రకటించారు.
సోలార్ పవర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని రావడానికి రూ. 564 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. త ద్వారా వ్యవసాయ పంపుసెట్లకు కూడా ఉచితంగా విద్యుత్ అందించే దిశగా లక్ష్యాలు నిర్దేశించున్నట్లు వెల్లడించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం ఆయన కుప్పం పట్టణానికి బుధవారం సాయంత్రం చేరుకున్నారు.
నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఆయన బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు రావాల్సి ఉంది. వాతావరణం అనుకూలించని స్థితిలో బెంగళూరు నుంచి హెలికాప్టర్లో ప్రయాణించడానికి ఏ టి సి అధికారులు అనుమతించలేదు.. దీంతో ఆయన రోడ్డు మార్గంలో కుప్పంకు సుమారు రెండున్నర గంటల ఆలస్యంగా చేరుకున్నారు.
"స్వర్ణ కుప్పం గా తీర్చిదిద్దాలని లక్ష్యంలో భాగంగా అందుబాటులో ఉన్న వనరులను మరింతగా సద్వినియోగం చేసుకొని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా" అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కుప్పంలోని ననియాల, మల్లనూరు, కంగుంది కోటను ప్రస్తావిస్తూ పర్యాటకంగా మరింత అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు.
"గ్రీన్ ఎనర్జీ సంపూర్ణ లక్ష్యాన్ని సాధించడానికి 564 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నాం" అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
కుప్పంలో ఎలక్ట్రిక్ ఏసి బస్సులు, ఎలక్ట్రిక్ ఆటోలు నడిపే విధంగా కార్యాచరణ ఉండబోతోందని ఆయన వెల్లడించారు.
కుప్పం బ్రాండ్ ప్రమోట్
కుప్పం ప్రాంతంలో ఉత్పత్తి చేసే కూరగాయలు, పూల తోటల సాగుకు ప్రసిద్ధి అనే విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పం బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దేనికోసం కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయాన్ని ఆయన వెల్లడించారు.
స్వర్ణ కుప్పం కోసం..
స్వర్ణ కుప్పం నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది తాను ఎంచుకున్న లక్ష్యం అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇందుకోసం నియోజకవర్గంలో రూ. 8.97 కోట్ల రూపాయలతో తాగునీటి పథకాలను ప్రారంభించారు. 7.63 కోట్ల రూపాయలతో గోకులం షెడ్లు, ఒకటి పాయింట్ 64 కోట్ల రూపాయలతో పాఠశాలలకు ప్రహరీ గోడలు, 3.7 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన వీధి దీపాలను ఆయన ప్రారంభించారు.
కుప్పం నియోజకవర్గంలోని అన్ని గ్రామపంచాయతీలకు 130 ఎలక్ట్రిక్ ఆటోలను ఆయన అందించారు. ఈ ఆటోల ద్వారా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి ఆదాయాన్ని పెంచుకునే దిశగా కార్యక్రమాలు అమలు చేయాలని ఆయన సూచించారు. దీనికి కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి తన లక్ష్యాలను కూడా వెల్లడించాలని ఆయన గుర్తు చేశారు.
కుప్పంలో మొత్తంగా 1297. 74 కోట్ల రూపాయల పథకాలను సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అంతేకాకుండా 3,041 మందికి అదనంగా కొత్తగా ఈ నెలలో పెన్షన్లు పంపిణీ చేశారు.
కుప్పంలో రూ. 3829తో హంద్రీనీవా కాలువ ద్వారా చివరి భూమి వరకు సాగునీరు అందిస్తామని ఆయన చెప్పారు.
కుప్పంలో 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సాధించడమే తమ లక్ష్యం అని చెప్పిన ఆయన ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి అన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కూడా కల్పిస్తామని ఆయన చెప్పారు.
కుప్పం ప్రాంతానికి పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, పర్యాటకంగా కూడా ఈ ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటు్ననట్లు ఆయన చెప్పారు.
ఏడాది లోపు హంద్రీ జలాలు
కుప్పంలోని ప్రతి ఎకరాకు హంద్రీనీవా జలాలు అందిస్తామని సీఎం ఎన్. చంద్రబాబు ప్రకటించారు. ఏడాది లోపు ఈ కార్యక్రమం పూర్తిగా అమలు చేయడానికి రూ. త్రీ,890 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
కుప్పంలో 1292 కోట్ల రూపాయల విలువైన పనులు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే రూ. 125 కోట్ల పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు.