హైకోర్టుకూ వేసవి సెలవులిస్తారా
వేసవి సెలవుల్లో వెకేషన్ కోర్టులను ఏర్పాటు చేశారు. అత్యవసర కేసులను ఈ కోర్టులు విచారణ చేపట్టనున్నాయి.;
By : The Federal
Update: 2025-05-11 08:52 GMT
వేసవి సెలవులనేవి కేవలం పాఠశాలలు, కాలేజీలకే కాదు కోర్టులకు కూడా ఉంటాయి. నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ నెల 12 సోమవారం నుంచి జూన్ 13 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సెలవులు ప్రకటించారు. జూన్ 14, జూన్ 15 శని, ఆదివారాలు కావడంతో జూన్ 16 నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కార్యకలాపాలు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. అయితే వేసివి సెలవుల నేపథ్యంలో ప్రత్యేక వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేసింది. అత్యవసర కేసులను ఈ కోర్టులు విచారణ చేపట్టనున్నాయి.
మొదటి దశ వెకేషన్ కోర్టులు ఈ నెల 15, 22, 29వ తేదీలలో కేసులను విచారణ చేపట్టనున్నాయి. సింగిల్ జడ్జి బెంచ్‌తో పాటు డివిజన్ బెంచ్‌లను ఏర్పాటు చేశారు. మే 15, మే 22న చేపట్టే విచారణలను జస్టిస్ కే సురేష్‌రెడ్డి, జస్టిస్ వై లక్ష్మణరావుతో కూడిన డివిజన్ బెంచ్, జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ జడ్జి బెంచ్‌లు విచారణ చేపట్టనున్నాయి.
మే 29న చేపట్టే అత్యవసర కేసుల విచారణలను జస్టిస్ ఎన్ హరినాథ్, జస్టిస్ వై లక్ష్మణరావు డివిజన్ బెంచ్‌తో పాటు జస్టిస్ చల్లా గుణరంజ్ సింగిల్ బెంచ్‌లు చేపట్టనున్నారు. రెండో దశ వెకేషన్ కోర్టులు జూన్ 5, జూన్ 12న రెండు రోజుల పాటు విచారణ చేపట్టనున్నాయి. జూన్ 5, జూన్ 12న జస్టిస్ ఎం కిర్మయి, జస్టిస్ టీసీడీ శేఖర్‌లతో కూడి డివిజన్ బెంచ్, జస్టిస్ కుంచం మహేశ్వరరావు సింగ్ బెంచ్ విచారణ చేపట్టనున్నాయి. జూన్ 16 నుంచి ఆంధ్రపదేశ్ హైకోర్టు యధావిధిగా తన కార్యకలాపాలను కొనసాగించనుంది.
2025వ సంత్సరంలో కోర్టుల సెలవులకు సంబంధించిన క్యాలెండర్‌ను గత డిసెంబర్‌లో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులు, ట్రిబ్యునళ్లు, లేబర్ కోర్టుల సెలవులకు సంబంధించిన క్యాలెండర్‌ను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. 2025 ఏడాదికి సంబంధించి మొత్తం 26 సాధారణ సెలవులతో పాటు 13 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. ఆ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు, మే 12 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు, సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3 వరకు దసరా సెలవులు ప్రకటించారు.