ఆంధ్రప్రదేశ్‌లో విచిత్ర వాతావరణం
ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓపక్క మాడ్చేసే ఎండలు కాస్తుంటే మరోపక్క ఉరుములు మెరుపులతో కూడిన చిరు జల్లులు పడనున్నాయి.;
By : The Federal
Update: 2025-04-28 01:10 GMT
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మండుటెండలు ఓపక్క.. చిరుజల్లులు మరోపక్క ఉండే విచిత్ర పరిస్థితి ఏర్పడింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏప్రిల్ 28 సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 29 మంగళవారం కూడా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ చెప్పారు.
ఇక, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఆదివారం అనకాపల్లి జిల్లా రావికమతం, వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో 41.4 డిగ్రీల సెల్సియస్, విజయనగరం జిల్లా గుర్లలో 41.2 డిగ్రీల సెల్సియస్, తూర్పుగోదావరి జిల్లా మురమండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పిడుగులు, వడదెబ్బలపై...
వాతావరణ మార్పులతో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉన్న వేళ ఓపెన్ ప్రదేశాల్లో ఉండరాదు. అలాగే, గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో వడదెబ్బ ప్రమాదం ఉండటంతో, ద్రవాల సేవ పెంచాలని, మధ్యాహ్న వేళలు బయటకు వెళ్లడం తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు.
వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
సోమవారం వర్షాలు పడే ప్రాంతాలు:
శ్రీకాకుళం
విజయనగరం
పార్వతీపురం మన్యం
అల్లూరి సీతారామరాజు
కాకినాడ
తూర్పు గోదావరి
ఏలూరు
మంగళవారం వర్ష సూచన ఉన్న ప్రాంతాలు:
శ్రీకాకుళం
పార్వతీపురం మన్యం
అల్లూరి సీతారామరాజు
అనకాపల్లి
కాకినాడ
ఏలూరు
ప్రజలకు సూచనలు:
పిడుగులు పడే సమయంలో ఓపెన్ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్త వహించాలి.
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో తగినంత నీరు తాగుతూ డీహైడ్రేషన్ నివారించుకోవాలి.
మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించుకోవడం మంచిది.