గోరంట్లలో 'నాయక్' విగ్రహం.. వీరుడా నీ త్యాగం వృథా కాదు..

వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ చిత్రపటానికి సీఎం ఘనంగా నివాళులర్పిస్తున్నారు. జిల్లా యంత్రాంగం కూడా సెల్యూట్ చేసింది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-05-09 14:31 GMT
వీారజవాన్ మురళీనాయక్

"ఆపరేషన్ సింధూర్" ప్రారంభమైన తరువాత రాయలసీమకు చెందిన యువ సైనికుడు వీరమరణం చెందారు. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన ఆయన త్యాగాన్ని భావితరాలకు అందించడానికి అనంతపురం జిల్లా గోరంట్లలో విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

కాశ్మీర్ లో పాక్ సౌనికుల చొరబాటును నియంత్రించడంలో జరిగిన హోరాహోరీ పోరులో జవాన్లకు సారధ్యం వహిస్తున్న మురళీనాయక్ వీరమరణం చెందారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే, ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవరం గోరంట్ల మండలం కల్లితాండ గ్రామానికి వెళ్లిన రాష్ట్ర మంత్రి ఎస్. సవితమ్మ మురళీనాయక్ తల్లిదండ్రులు, జ్యోతిబాయి, శ్రీరాం నాయక్ ను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మురళీ నాయక్ ధైర్య సాహసాలు భవిష్యత్తు తరాలకు తెలియాలనే లక్ష్యంతో గోరంట్ల మండలం ప్రధాన సర్కిల్ లో ఆయన విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.

ఆదుకుంటాం సీఎం చంద్రబాబు

అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం ఎన్. చంద్రబాబుకు ఈ విషయం తెలియగానే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో మురళీనాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కూడా నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
వీరుడా సెల్యూట్
జమ్మూకశ్మీర్​ సరిహద్దుల్లో పాకిస్తాన్​ సేనలతో తలపడుతూ వీరమరణం పొందిన తెలుగు జవాన్​ మురళీ నాయక్​ కు సెల్యూట్ అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ త్యాగధనుడని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
మీ సేవలు వృథా కాదు...
దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నివాళులర్పించారు. మాతృ భూమి కోసం ప్రాణాలర్పించిన మురళి నాయక్ సేవలు దేశం మరువదు. దేశం కోసం మీరు చేసిన సేవలు వృధా కావు. అని సంతాప సందేశంలో పేర్కొన్నారు. మీరు అమరులైన మా స్మృతి లో సజీవులే అని నివాళులర్పించారు.
నీ త్యాగం మరువలేం..

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయిక్ త్యాగాలు మరవలేం అని సత్యసాయి జిల్లా యంత్రాంగం ఘనంగా నివాళులర్పించింది. కలెక్టరేట్ లో వీరజవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ, సరిహద్దుల్లో మురళీ నాయక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు దేశానికే కాక రాష్ట్ర ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ విజయసారథి పాల్గొన్నారు. మురళీనాయక్ పేరు చరిత్రపుటల్లో చిరస్మరణీయంగా ఉంటుందని కలెక్టర్ చేతన్ నివళులర్పించారు. కొంత సమయం మౌనం పాటించారు
యుద్ధంలో జవాన్ మురళీనాయక్ చనిపోవడం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్పారు. మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని సంతాపం వ్యక్తం చేశారు.
ఆవేదన కలిగించింది
"పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్దంలో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ వీర మరణం పొందడం తీవ్ర వేదనను కల్గించింది" అని అనకాపల్లి ఎం.పీ సీఎం రమేశ్ సంతాపం తెలిపారు. ఆపరేషన్ సింధూర్ లో జమ్మూ కాశ్మీర్ యుద్ధభూమిలో విరోచితంగా పోరాడుతూ జవాను మురళీ నాయక్ వీర మరణం పొందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని వ్యాఖ్యానించారు. నాయక్ ప్రదర్శించిన ధైర్యసాహసాలకు తెలుగు రాష్ట్రాల తరఫున జేజేలు పలుకుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా మురళీ నాయక్ కుటుంబాన్ని ఆదుకుంటుంది అని తెలిపారు.
వీరుడా మరువదు ఈ గడ్డ
"వీరుడా చరిత్ర మరువదు నీ ఘనత...
నాయద సదా ఉంటుంది నీ పట్ల కృతజ్ఞత"
అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా వెంకటసత్యనారాయణ సంతాప సందేశం విడుదల చేశారు. దేశ ప్రజలు కోసం అమరుడైన మురళీనాయక్ ఘన నివాళులు అర్పిస్తున్నాను. అని నమస్సుమాంజలి సమర్పించారు.
దేశం మరువదు వీరుడా..
కాశ్మీర్ లో వీరమరణం పొందిన మురళీ నాయక్ త్యాగాన్ని దేశం మరువదని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సంతాపం తెలిపారు. ఈ విషాధ సమయంలో నాయక్ కుటుంబానికి భగవంతుడు శక్తి, ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుతున్నానని అన్నారు. భారతదేశం తన శక్తిని ప్రపంచానికి చూపించింది. మన దేశాన్ని విడదీయాలని ప్రయత్నించిన వాళ్లకు ఇప్పుడు వాళ్ల స్థానం చూపించాం. అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాకిస్థాన్ మన దేశంలో వైరం కలిగించాలని చూశారు, కానీ ప్రతి భారతీయుడు ఒక్కటై, మేము ఒక్కటైన భారత్అ ని నిరూపించారన్నారు. శాంతిని కోరుకుంటాం, కానీ అవసరమైతే దిమ్మ తిరిగే బలంతో భారత సైన్యం సమాధానం చెప్పగలదని నిరూపించామన్నారు.
Tags:    

Similar News