తిరుమల భక్తులకు అలర్ట్ - మే 4న శ్రీవారి దర్శన టోకెన్ల జారీ..!
మే 4న స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్ల జారీ;
By : Dinesh Gunakala
Update: 2025-05-03 00:30 GMT
తిరుమల శ్రీవారి దర్శనం కోటా టోకెన్లను మే నాలుగో తేదీన టీటీడీ విడుదల చేయనుంది. ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే మే ఆరో తేదీన స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. అందుకోసం భాగంగా మే 4వ తేది ఆదివారం స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది.
తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో టోకెన్లు అందిస్తారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుంచి టోకెన్ల జారీ ఉంటుంది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందొచ్చు.