TIRUMALA || మే నెలలో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు.

తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలలో జరిగే పండుగలు, ఉత్సవాల గురించి టీటీడీ ప్రకటించింది.;

Update: 2025-04-28 12:06 GMT

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి నెలా విశేష పర్వదినాలు ఉంటాయి.మే నెలకు సంబంధించి తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వదినాల వివ‌రాలను టీటీడీ వెల్లడించింద.మే 1న అనంతాళ్వార్ ఉత్సవారంభం.మే 2న భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి నిర్వహిస్తారు.మే 6న శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభం.మే 8న పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు సమాప్తి అవుతాయి.మే 10న అనంతాళ్వార్ శాత్తుమొర. మే 11న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి నిర్వహిస్తారు. మే 12న కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి, పౌర్ణమి గరుడ సేవ. మే 14న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం. మే 22న హనుమజ్జయంతి నిర్వహిస్తారు.మే 31న నమ్మాళ్వార్ ఉత్సవారంభం అవుతుందని టీటీడీ తెలిపింది.


Tags:    

Similar News