సింహాచలం దుర్ఘటన బాధాకరం..నేడు విశాఖకు జగన్‌

సింహాచలం అప్పన్న స్వామి సన్నిధిలో చోటుచేసుకున్న దుర్ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ బుధవారం మధ్యాహ్నం విశాఖకు వెళ్లనున్నారు.;

Update: 2025-04-30 07:52 GMT

సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి దైవ దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్‌ క్యూలైన్‌లో దేవుడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్న సయమంలో అకస్మాత్తుగా గోడ కుప్పకూలిన ఘటనలో భక్తులు మరణించడం తీవ్ర విచారకరమని పేర్కొన్నారు. అప్పన్న స్వామి వారి నిజరూప దర్శనానికి వచ్చి క్యూలో నిల్చున్న భక్తులు ఇలాంటి దుర్ఘటనలో మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. తీవ్రంగా కలచివేసిన ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన అత్యవసర వైద్య సాయం అందించాలని, ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జగన్‌ ప్రభుత్వాన్ని కోరారు.

మరో వైపు అప్పన్న స్వామి సన్నిధిలో గోడ కూలి బాధితులగా మారిన కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.
Tags:    

Similar News