TIRUPATI || అలిపిరిలో తనిఖీల వైఫల్యం.!
అన్యమత వ్యాఖ్యలతో తిరుమలకు వచ్చిన కారు.;
By : Dinesh Gunakala
Update: 2025-05-10 06:09 GMT
అలిపిరి లో భద్రతా తనిఖీల వైఫల్యం మరోసారి వెలుగుచూసింది. అన్యమతనానికి చెందిన తమిళ వ్యాఖలతో కూడిన ఓ కారు తిరుమలకు రావడం విమర్శలకు దారితీసింది. సాధారణంగా రాజకీయ, ఇతర మతాలకు చెందిన ఫొటోలు, గుర్తులు, నినాదాలతో వాహనాలు తిరుమలకు రావడం నిషేధం.
వీటిని అలిపిరి చెక్‌పాయింట్ తనిఖీల్లోనే భద్రతా సిబ్బంది అడ్డుకోవాలి
అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇతర మతానికి చెందిన తమిళ వ్యాఖ్యలతో కూడిన కారు నేరుగా తిరుమల ఆలయానికి సమీపంలోని బస్టాండ్ వద్ద పార్కింగ్ లో ఉంచడం చర్చనీయాంశమైంది.