సేవ్‌ సంస్కృతి సైకత శిల్పం అదుర్స్‌

ఇద్దరు బాలికలు 8 గంటల సేపు శ్రమించి దీనిని రూపొందించారు.;

By :  Admin
Update: 2025-01-12 06:59 GMT

సంక్రాంతి సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడు కోవాలి.. స్వామివివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ యువజన దినోత్సవం.. రెండింటిని పురస్కరించుకుని ఇద్దరు బాలికలు రూపొందించిన సైకత శిల్పం అబ్బురపరుస్తోంది. దానిని చూసేందు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నేడు స్వామి వివేకానంద జయంతి. దీనిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తారు. సంక్రాంతి సందర్భంగా ఆచరించే సంప్రదాయాలు, పాటించే పద్దతులు వంటి సంస్కృతులు..రెండు సందర్భాలను పురస్కరించుకొని ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకత శిల్ప నిపుణులు దేవిన శ్రీనివాస్‌ కుమార్తెలు దేవిన సోహిత, దేవిన ధన్యతలు కలిసి శనివారం ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. 14 అడుగులు వెడల్పు, 6 అడుగులు ఎత్తు కలిగిన ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇద్దరు బాలికలు దాదాపు 8 గంటల సేపు కష్టపడి అందంగా తీర్చి దిద్దారు. ఒక వైపు స్వామి వివేకానంద చిత్రం, మరో వైపు సంక్రాంతి సంస్కృతి ఉట్టిపడే విధంగా రెంటిండిని మేళవించి ఒకే సైకత శిల్పంలో రూపొందించారు. సేవ్‌ కల్చర్‌ అని దీని ద్వారా బాలికలు సమాజాన్ని కోరారు. ఎంతో శ్రమించి, చూపరులను ఆకట్టుకునే విధంగా రూపొందించిన సోదరీ మణులను పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానికులు అభినందించారు.

Tags:    

Similar News