పిఠాపురంలో మహిళలకు చీర,కుంకమ కిట్లు

జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు భార్య పద్మజ తొలి పూజలో పాల్గొన్నారు.;

Update: 2025-08-22 08:43 GMT

జనసేన ఆధ్వర్యంలో పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో 10వేల మంది మహిళలకు చీర, కుంకమ కిట్లను ఆ పార్టీ శ్రేణులు పంపిణీ చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పిఠాపురం పాదగయ క్షేత్రంలోని శ్రీ ఉమా కుక్కుటేశ్వరస్వామి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు.


జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు భార్య పద్మజ తొలి పూజలో పాల్గొన్నారు. అనంతరం పూజలో పాల్గొన్న మహిళలకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈ కిట్లను పంపించిన చీర, కుంకమ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త మరెడ్డి శ్రీనివాస్, ఇతర నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Tags:    

Similar News