ముదురుతున్న రామ్ చరణ్ ‘దర్గా’ వివాదం

అయ్యప్పమాల వేసుకుని చరణ్ దర్గాలోకి ప్రవేశించటాన్ని అయ్యప్ప(Ayyappa Temple) జాయింట్ కమిటీ తప్పుపడుతోంది.

Update: 2024-11-21 05:25 GMT

రామ్ చరణ చుట్టూ దర్గా వివాదం ముదిరిపోతోంది. అయ్యప్పమాల వేసుకుని చరణ్ దర్గాలోకి ప్రవేశించటాన్ని అయ్యప్ప(Ayyappa Temple) జాయింట్ కమిటీ తప్పుపడుతోంది. మూడు రోజుల క్రితం రామ్ చరణ్(Ramcharan) కడప(Kadapa Darga)లోని దర్గాకి వెళ్ళి ప్రార్ధన చేసిన విషయం తెలిసిందే. అయ్యప్పమాల వేసుకుని ముస్లింల పవిత్ర ప్రార్ధనామందిరమైన దర్గాకు ఎలా వెళతారంటు అయ్యప్పమeల వేసుకున్న భక్తులు కూడా మండిపోతున్నారు. ఇదే విషయమై అయ్యప్పజాయింట్ యాక్షన్ కమిటి గురుస్వాములు బుచ్చిరెడ్డి, రాధాకృష్ణ, ప్రేమ్ గాంధీ మీడియాతో మాట్లాడుతు అయ్యప్పమాల వేసుకుని దర్గాలోకి వెళ్ళిన రామ్ చరణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.



 అయ్యప్పమాల వేసుకున్నపుడు ఇతర మతాల ప్రార్ధనాస్ధలాల్లోకి ఎలాగ వెళతారని రామ్ చరణ్ ను నిలదీశారు. రామ్ చరణ్ చేసిన పనివల్ల అయ్యప్పమాల అపవిత్రమైపోయిందని మండిపడ్డారు. దర్గాలోకి వెళ్ళేసమయంలో అయ్యప్పమాల దీక్షా సమయంలో పెట్టుకునే బొట్టును కూడా రామ్ చరణ్ తొలగించటం తీరని అవమానమనమే కాకుండా అపచారం కూడా చేసినట్లుగా చెప్పారు. రామ్ చరణ్ దర్గాకు వెళ్ళింది సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rehman) కోసమే అని గురుస్వాములన్నారు. రామ్ చరణ్ దర్గాకు వెళ్ళినట్లే రెహమాన్ తిరుమల శ్రీవారి(TTD) దేవాలయానికి, శబరిమల(Sabarimala)కు వచ్చి దర్శనం చేసుకుంటారా ? అని ప్రశ్నించారు. చేసిన తప్పుకు రామ్ చరణ్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని గురుస్వాములు హెచ్చరించారు.



 ఇదే విషయమై రామ్ చరణ్ భార్య ఉపాసనా కొణిదెల(Upasana Konidela) ట్వీట్ చేశారు. ‘దేవుడిమీద నమ్మకం అందరినీ కలుపుతుందే కాని ఎవరినీ విడదీయద’న్నారు.

‘భారతీయులుగా అన్నీ మతాలను గౌరవిస్తునే, అందరినీ కలుపుకుని వెళతా’మని చెప్పారు. ఐకమత్యమే తమ బలమన్నారు. ‘సొంత మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తా’మని కూడా ఉపాసన చెప్పారు.

Tags:    

Similar News