బెరించడం మానేయండి..జగన్ కి పవన్ వార్నింగ్
ఏపీలో లా అండ్ ఆర్డర్ ముఖ్యమని, క్రిమినాలిటీని అణిచివేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.
By : Vijayakumar Garika
Update: 2025-12-22 14:12 GMT
కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును, తనను బెదిరించడం మానేయాలని వైసీపీ, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ రౌడీయిజం సాగనివ్వమని, బెదిరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. పోలీసులను చంపేస్తారా? అంటూ జగన్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. తమకు ఏపీలో లా అండ్ ఆర్డర్ ముఖ్యమని, క్రిమినాలిటీని అణిచివేస్తామన్నారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు.
బెదిరింపులకు భయపడొద్దు
వైఎస్ జగన్, ఆ పార్టీ నేతల బెదిరింపులకు భయపడొద్దన్నారు. వైసీపీ నేతలు మళ్లీ అధికారంలోకి వస్తామని, పోలీసులను అరెస్టు చేస్తామని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీ నాయకులు బెదిరించడాలు మానేయాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. జగన్ అండ్ కో మళ్లీ అధికారంలోకి వస్తారనే మాటలను పారిశ్రామికవేత్తలు, అధికారులు నమ్మవద్దు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీకి, దేశ సమగ్రతకు భంగం వాటిళ్లకుండా చూస్తాను" అని ఆయన స్పష్టం చేశారు.
వ్యవస్థలను నాశనం చేశారు
గత ప్రభుత్వ హయాంలో పొలిటికల్ లీడర్ షిప్ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు. అధికారులు స్వతంత్రంగా పనిచేయలేని పరిస్థితిని కల్పించారని, క్రిమినాలిటీ పెరిగితే రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ (శాంతిభద్రతలు) కంట్రోల్‌లో ఉంటేనే రాష్ట్రంపై నమ్మకం పెరుగుతుందని, సేఫ్టీ టూరిజం పాలసీ రావాలని తాను బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

పోలీసులకు భరోసా
జ్యూడీషియరీ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు భయపడాల్సిన అవసరం లేదని, చట్టాన్ని అతిక్రమించే గంజాయి రౌడీలను, క్రిమినల్స్‌ను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము చేసే సంక్షేమ కార్యక్రమాలకు అందరూ మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.