గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాన మంత్రి

అమరావతికి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ;

Update: 2025-05-02 09:58 GMT

అమరావతిలో జరిగే పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం 3.15 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టులో దిగారు. అక్కడే స్వాగతం పలికేందుకు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు మొత్తం 23 మంది అనుమతి ఉన్న వారు ఆయకు స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్ అమరావతికి బయలు దేరింది. రక్షణగా మరో రెండు హెలికాప్టర్ లు ప్రధాని ప్రయాణించే హెలికాప్టర్ తో పాటు బయలు దేరాయి. ఇప్పటికే అమరావతికి భారీ స్థాయిలో జనం చేరారు. అమరావతి నిర్మాణ పనుల పైలాన్ ను ప్రారంభిస్తారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు. స్వాగతోపన్యాసాన్ని పట్టణ, మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ చేస్తారు.

సభా వేదిక వద్ద రైతులు పచ్చ కండువాలతో కనిపిస్తున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన జెండాలు పలువురు తీసుకొచ్చారు. ముందుగా పైలాన్ ను ప్రధాన మంత్రి ప్రారంబించి అనంతరం ఫొటో గ్యాలరీని సందర్శిస్తారు. అమరావతి హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాన్ ఇంకా పలువురు మంత్రులు, నాయకులు, కేంద్ర మంత్రులు ఉన్నారు.

Tags:    

Similar News